Home » AP Cabinet Meet
దేశంలో తొలి క్వాంటం కంప్యూటర్ అమరావతిలో ఏర్పాటు చేస్తున్న దృష్ట్యా కీలక ప్రతిపాదనకు కేబినెట్‌లో ఆమోదం తెలిపినట్లు మంత్రి పార్ధసారథి చెప్పారు. క్వాంటం కంప్యూటింగ్‌లో రూ.1421 కోట్ల రూపాయల పెట్టుబడులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. పలు సంస్థలకు భూ కేటాయింపులకు కేబినెట్ అనుమతి ఇచ్చింది.
కేబినెట్ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన నలుగురు మంత్రులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మంత్రివర్గ సమావేశానికి ఆలస్యంగా వస్తే ఎలా అని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏపీ మంత్రి మండలి సమావేశం గురువారం జరుగుతోంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై మంత్రులతో చర్చిస్తున్నారు సీఎం చంద్రబాబు.
మంత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. మొంథా తుఫాను సమయంలో అంతా బాగా పనిచేశారని.. ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించామని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్న నేపథ్యంలో సదస్సు ఏర్పాట్లపై మంత్రులు, అధికారులను అడిగి సీఎం చంద్రబాబు వివరాలు తెలుసుకోనున్నారు. ఈ మేరకు క్యాబినెట్ భేటీలో సుమారు రూ.లక్ష కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో అమరావతి సచివాలయంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై మంత్రుల బృందం బుధవారం సమావేశమైంది. ఈ నేపథ్యంలో గత జగన్ ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా జరిగిన జిల్లాల విభజనను సరిదిద్దడంపై మంత్రులు చర్చిస్తున్నారు.
ఏపీ కేబినెట్ సమావేశాన్ని నవంబర్ 10వ తేదీకి వాయిదా వేస్తూ సీఎస్ కార్యాలయం నోట్ విడుదల చేసింది.
గడిచిన 15 నెలల కాలంలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శ్రేయస్సుకు అనేక పాలసీలు ఇచ్చామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. వివిధ పాలసీలకు అనుగుణంగా ప్రోత్సాహకాలు ఇచ్చి రూ.1.17లక్షల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు చెప్పారు.
ఆర్సెలార్ మిత్తల్ ప్లాంట్‌కు త్వరలో శంకుస్థాపన చేయబోతున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖను ముంబై లాగా అభివృద్ధి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.