Chandrababu Appreciated Ministers: మంత్రులకు సీఎం చంద్రబాబు అభినందనలు.. ఎందుకంటే
ABN , Publish Date - Nov 10 , 2025 | 12:59 PM
మంత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. మొంథా తుఫాను సమయంలో అంతా బాగా పనిచేశారని.. ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించామని అన్నారు.
అమరావతి, నవంబర్ 10: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఈ సందర్బంగా సమావేశంలో మంత్రులను సీఎం అభినందించారు. మొంథా తుఫాను సమయంలో క్షేత్ర స్థాయిలో బాగా పనిచేశారని మంత్రులను ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి ఒక్కరూ క్షేత్ర స్థాయిలో ఉండి... ప్రజలకు తక్షణ సాయం అందేలా చేశారన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికార యంత్రాంగం పూర్తి సమన్వయంతో పని చేయడం వల్లనే తుఫాను సహాయక చర్యలు వేగంగా అందయాని తెలిపారు.
ఆర్టీజీ సెంటర్ నుంచి నిరంతర పర్యవేక్షణ, టెక్నాలజీ సహాయంతో ప్రాణ, ఆస్థి నష్టాన్ని చాలా వరకు తగ్గించగలిగామన్నారు. మంత్రులు, అధికారులు, యంత్రాంగం టీం స్పిరిట్‌తో పనిచేస్తే ఇటువంటి మంచి ఫలితాలే వస్తాయని తెలియజేశారు. అంతా ఎలా కష్టపడి పనిచేశారో స్వయంగా చూశానంటూ మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు.
కాగా.. సీఎం అధ్యక్షత జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో సుమారు 70 అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడులకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. మొంథా తుఫాన్ ప్రభావం, నష్టం అంచనాలు, పరిహారంపై చర్చించనున్నారు. ఈ 14,15 తేదీల్లో విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సుపై చర్చించనున్నారు. క్వాంటం కంప్యూటింగ్ పాలసీ 2025-30కి మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. ప్రతిపాదిత డ్రోన్ సిటీలో భూమి కేటాయింపు పాలసీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.
ఇవి కూడా చదవండి...
డిసెంబర్ 6న డాలస్‌లో మంత్రి నారా లోకేష్ పర్యటన.. సభ కోసం భారీ ప్లానింగ్
రాయలచెరువు గండి ఘటన.. ప్రభుత్వం కీలక నిర్ణయం
Read Latest AP News And Telugu News