Share News

CM Chandrababu: ఢిల్లీకి చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు

ABN , Publish Date - May 29 , 2025 | 09:35 PM

ఢిల్లీలో పర్యటన నిమిత్తం సీఎం చంద్రబాబు గురువారం నాడు ఢిల్లీ వెళ్లారు. కడప నుంచి నేరుగా ఢిల్లీకి గురువారం సాయంత్రం బయలుదేరారు. శుక్రవారం రాత్రి కూడా ఢిల్లీలోనే ముఖ్యమంత్రి బస చేయనున్నారు. ఢిల్లీ నుంచి శనివారం రాజమండ్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు.

CM Chandrababu: ఢిల్లీకి చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు
AP CM Chandrababu Naidu

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (AP CM Chandrababu Naidu) ఢిల్లీలో పర్యటన నిమిత్తం వెళ్లారు. కాసేపటి క్రితమే ఢిల్లీకి చేరుకున్నారు. మహానాడును ముగించుకుని కడప నుంచి నేరుగా ఢిల్లీకి వచ్చారు. విమానాశ్రయంలో చంద్రబాబుకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, సానా సతీష్‌తో సహా పలువురు టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి నేరుగా అధికారిక నివాసం వన్‌జన్‌పథ్‌కు ముఖ్యమంత్రి వెళ్లనున్నారు. రేపు (శుక్రవారం) సీఐఐ సదస్సుకు చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు.


కాగా, రేపు (శుక్రవారం) రాత్రి ఢిల్లీలోనే బస చేయనున్నారు. ఢిల్లీ నుంచి ఎల్లుండి (శనివారం) రాజమండ్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గం గున్నేపల్లిలో పింఛన్లు పంపిణీ చేయనున్నారు. జూన్ 1వ తేదీ ఆదివారం కావడంతో శనివారమే పింఛన్లు పంపిణీ చేయనున్నారు. గున్నేపల్లి గ్రామస్తులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం ప్రజలను అడిగి వారి సమస్యలను సీఎం చంద్రబాబు తెలుసుకోనున్నారు.

అయితే, గురువారం మహానాడు ప్రాంగణం నుంచి ఎయిర్ పోర్టుకు సీఎం చంద్రబాబు బయలుదేరారు. చంద్రబాబును చూసేందుకు దారి పొడుగునా రోడ్లకు ఇరువైపులా శ్రేణులు బారులు దీరారు. పార్టీ శ్రేణుల కోలాహలంతో నెమ్మదిగా సీఎం కాన్వాయ్ వెళ్లింది. ఎయిర్ పోర్టుకు వెళ్లే మార్గంలో రెండుసార్లు ఆగి ప్రజలకు చంద్రబాబు అభివాదం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఎప్పుడంటే..

వెన్నుపోటు రాజకీయాలు రావంటూ కవిత సంచలన వ్యాఖ్యలు

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 29 , 2025 | 09:43 PM