Share News

Amaravati Land Case: రాజధాని అసైన్డ్ భూముల కేసులో మరో కీలక పరిణామం

ABN , Publish Date - Dec 01 , 2025 | 08:57 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో తమపై నమోదైన కేసును కొట్టివేయాలని సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ.. ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై సోమవారం న్యాయస్థానంలో విచారణ జరిగింది.

Amaravati Land Case: రాజధాని అసైన్డ్ భూముల కేసులో మరో కీలక పరిణామం
Amaravati Land Case

అమరావతి, డిసెంబరు1 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో (Amaravati Land Case) తమపై నమోదైన కేసును కొట్టివేయాలని సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ.. ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై ఇవాళ(సోమవారం) న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఈ కేసులో ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి హాజరు కావడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ్ లూథ్రా.


గతంలో పొన్నవోలు సీఐడీ తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్‌గా హాజరైన విషయాన్ని గుర్తు చేశారు లూథ్రా. ఇప్పుడు ఫిర్యాదుదారుడు తరపున హాజరుకావడం బార్ కౌన్సిల్ నిబంధనలకు విరుద్ధమని వాదించారు లూథ్రా. అయితే, ఆళ్ల రామకృష్ణా రెడ్డి తరపున తాను హాజరుకావడాన్ని సమర్థించుకున్నారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఫిర్యాదు దారుడు తరపున పొన్నవోలు హాజరు కావచ్చా..? లేదా అనే విషయం వచ్చే విచారణలో తేలుస్తామని స్పష్టం చేసింది హైకోర్టు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పట్లో చంద్రబాబు, నారాయణలపై కేసు నమోదు చేశారు సీఐడీ అధికారులు. సీఐడీ నమోదు చేసిన కేసుపై హైకోర్టు గతంలో స్టే విధించింది.


ఈ వార్తలు కూడా చదవండి...

పింఛన్ల పంపిణీలో ఏపీదే అగ్రస్థానం: సీఎం చంద్రబాబు

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్థం: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 01 , 2025 | 09:15 PM