Minister Kandula Durgesh: టూరిజం శాఖకు ఇండస్ట్రీయల్ స్టేటస్ .. మంత్రి కందుల దుర్గేష్ కీలక నిర్ణయాలు
ABN , Publish Date - Jan 26 , 2025 | 08:19 PM
Minister Kandula Durgesh: టూరిజం శాఖకు ఇండస్ట్రీయల్ స్టేటస్ తీసుకువచ్చామని సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రుషికొండ ప్యాలెస్ నిర్మాణం ద్వారా టూరిజం శాఖకు తీవ్రమైన నష్టం వాటిల్లిందని ఆరోపించారు. రానున్న రోజుల్లో వైసీపీ పూర్తిగా ఖాళీ అయిపోతుందని విమర్శించారు.

రాజమండ్రి: పాపికొండల పర్యాటకం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈనెల 27వ తేదీ నుంచి విశాఖపట్నంలో టూరిజం ఇన్వెస్టర్ మీట్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు 150 మంది ఇన్వెస్టర్లు వస్తున్నారని చెప్పారు. ఇవాళ(ఆదివారం) రాజమండ్రిలో మంత్రి కందుల దుర్గేష్ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ.. సుమారుగా 15 మంది ఇన్వెస్టర్లతో ఎంవోయూ చేసుకుంటున్నామని తెలిపారు. అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టులకు నిధులు మంజూరయ్యాయని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఉన్న అనుబంధం వల్ల ప్రాజెక్టులు వేగవంతంగా పట్టాలు ఎక్కుతున్నాయని చెప్పుకొచ్చారు. అన్నవరం వద్ద రూ.25 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నామని తెలిపారు. టూరిజం శాఖకు ఇండస్ట్రీయల్ స్టేటస్ తీసుకువచ్చామని అన్నారు. సినిమా రంగానికి సంబంధించి ప్రత్యేకమైన పాలసీని రూపొందిస్తున్నామని తెలిపారు. ఐదు సంవత్సరాల పదవీకాలంలో మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దావోస్ పర్యటనకు ఎందుకు వెళ్లాలని నిలదీశారు. రుషికొండ ప్యాలెస్ నిర్మాణం ద్వారా టూరిజం శాఖకు తీవ్రమైన నష్టం వాటిల్లిందని ఆరోపించారు. రానున్న రోజుల్లో వైసీపీ పూర్తిగా ఖాళీ అయిపోతుందని విమర్శించారు. వైసీపీపై ప్రజల్లోనే కాదు ఆ పార్టీ నేతల్లో కూడా విశ్వాసం సన్నగిల్లుతోందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Vijayasai Reddy: విజయసాయిరెడ్డి భవిష్యత్తు ప్లాన్ ఇదేనా..!
Republic Day.. ఏపీలో రిపబ్లిక్ వేడుకలు.. అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం..
Republic Day.. బీజేపీకి రాజ్యాంగం అంటే గౌరవం లేదు: వైఎస్ షర్మిల
Read Latest AP News and Telugu News