Minister Atchannaidu: జగన్ హయాంలో సహకార, వ్యవసాయ పరపతి సంఘాల్లో అవినీతికి పాల్పడ్డారు
ABN , Publish Date - Nov 08 , 2025 | 08:47 PM
మొంథా తుపాన్ వల్ల నష్టపోయిన ప్రతీ రైతుకు పరిహారం అందజేస్తామని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు భరోసా కల్పించారు. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వెంటనే ఆదేశాలు ఇచ్చామని అన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతులని పట్టించుకోలేదని ఆరోపించారు మంత్రి అచ్చెన్నాయుడు.
రాజమండ్రి,నవంబరు8 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాను వల్ల సంభవించిన పంట నష్టాన్ని నమోదు చేశామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) తెలిపారు. ప్రతీ గ్రామానికి వెళ్లి పంట నష్టం తెలుసుకున్నామని వెల్లడించారు. వరికి హెక్టార్‌కు రూ. 17 వేల పరిహారం వైసీపీ తగ్గించిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో వరిపంటకు నష్టం రూ. 25 వేలు ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఇవాళ(శనివారం) రాజమండ్రిలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు.
ఈ సందర్భంగా అధికారులతో మొంథా తుఫాను పంట నష్టానికి సంబంధించిన విషయాలపై మంత్రి ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. అరటిపంటకు రూ. 35 వేలు నష్టపరిహారం ఇస్తున్నామని తెలిపారు. మొంథా తుఫాను వల్ల నష్టపోయిన ప్రతీ రైతుకు పరిహారం అందజేస్తామని భరోసా కల్పించారు. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చామని అన్నారు. వైసీపీ హయాంలో రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం కొనుగోలు రూ.1600 కోట్లు బకాయి పెట్టారని ఆరోపించారు అచ్చెన్నాయుడు.
తమ ప్రభుత్వంలో సహకార, వ్యవసాయ పరపతి సంఘాలను మరింత బలోపేతం చేస్తామని అన్నారు. జగన్ హయాంలో పరపతి సంఘాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శించారు. సహకార, వ్యవసాయ పరపతి సంఘాల్లో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. సహకార, వ్యవసాయ పరపతి సంఘాలపై వైసీపీ పాలనలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని ఏపీ శాసన సభలో ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి.. ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు
కుప్పంలో ఏడు ప్రాజెక్టులకు శంకుస్థాపన.. భారీగా ఉద్యోగావకాశాలు
Read Latest AP News And Telugu News