Home » Rajamahendravaram
రాజమండ్రి సెంట్రల్ జైలుపై డ్రోన్ కలకలం సృష్టించింది. సెంట్రల్ జైలు సమీపంలోని ఒక అపార్ట్‌మెంట్ నుంచి గుర్తు తెలియని వ్యక్తి డ్రోన్ ఎగరవేశారు. సెంట్రల్ జైలు ఆవరణలోకి డ్రోన్ రావడంతో పోలీసులకు జైలు సూపరిటెండెంట్ రాహుల్ ఫిర్యాదు చేశారు.
వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి జైల్లో వసతులు కల్పించాలని పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో జులై21న విచారణ జరిగింది. నోటీసు తీసుకోవటం లేదని న్యాయమూర్తి దృష్టికి న్యాయవాదులు తీసుకువచ్చారు. మిథున్‌రెడ్డిని జైల్లో నేల మీద పడుకోబెట్టారని మిథున్‌రెడ్డి లాయర్లు చెబుతున్నారు. మంచం ఇచ్చామని కోర్టుకు ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా రంగంపేట వద్ద రోడ్డు డైవర్షన్‌లో నిలిపిన పాల వ్యాన్‌ను ఢీకొన్న కారు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. ఒకే కుటుంబానికి చెందిన వారు కాకినాడ నుండి తిరిగి వస్తుండగా ఈ విషాదం జరిగింది.
రాజమహేంద్రవరంలోని ఆర్టీసీ ఉద్యోగి వీరభద్రరావు తన కుమారుడికి పునఃమూల్యాంకనంలో అన్యాయం జరిగిందని మంత్రి లోకేశ్‌కి ఫిర్యాదు చేశారు. హిందీ పేపర్‌లో పునఃమూల్యాంకనం కోసం రూ.1,000 చెల్లించినా మార్కులు మారలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.
Gorantla Butchaiah Chowdary: వైసీపీ నేతలపై రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో ఏపీకి తీరని నష్టం జరిగిందని ఆరోపించారు.
2006లో అక్రమ ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఫారెస్టు అధికారి కాసకాని సత్యనారాయణకు 2025లో శిక్ష పడింది.రెండు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించగా, ఆయనకు పింఛను నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆపరేషన్ సిందూర్ విజయాన్ని పురస్కరించుకుని మూడు జిల్లాల్లో ఘనంగా తిరంగా ర్యాలీలు నిర్వహించారు. మంత్రి, ఎంపీలు, అధికారులు, విద్యార్థులు పాల్గొని దేశభక్తి నినాదాలు చేశారు.
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. చంద్రబాబు అక్రమ అరెస్టులు చేసినా వైసీపీ ఈ ఎన్నికల్లో గెలుస్తుందని, జగన్ మళ్లీ సీఎం అవుతారని ఆయన అన్నారు
పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం రోడ్డు ప్రమాదం కాకుండా అన్యాయంగా చనిపోవడం అని క్రైస్తవ సంఘాల ప్రతినిధులు ఆరోపించారు. వారి పిలుపు మేరకు రాజమహేంద్రవరం రూరల్ మండలంలో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు
పాస్టర్ ప్రవీణ్ మృతి రోడ్డు ప్రమాదమేనని పోలీసు దర్యాప్తు స్పష్టం చేసింది. బైక్ హెడ్‌లైట్ పనిచేయకపోవడం, మద్యం సేవించి స్కిడ్ కావడం ప్రమాదానికి కారణంగా నిర్ధారణ అయ్యింది