Share News

AP News: రాజమండ్రి జైల్లో డ్రోన్ కలకలం.. పోలీసులు అలర్ట్

ABN , Publish Date - Aug 01 , 2025 | 02:38 PM

రాజమండ్రి సెంట్రల్ జైలుపై డ్రోన్ కలకలం సృష్టించింది. సెంట్రల్ జైలు సమీపంలోని ఒక అపార్ట్‌మెంట్ నుంచి గుర్తు తెలియని వ్యక్తి డ్రోన్ ఎగరవేశారు. సెంట్రల్ జైలు ఆవరణలోకి డ్రోన్ రావడంతో పోలీసులకు జైలు సూపరిటెండెంట్ రాహుల్ ఫిర్యాదు చేశారు.

AP News:  రాజమండ్రి జైల్లో డ్రోన్ కలకలం.. పోలీసులు అలర్ట్
Rajahmundry Central Jail

రాజమండ్రి: రాజమండ్రి సెంట్రల్ జైలుపై (Rajahmundry Central Jail) డ్రోన్ కలకలం సృష్టించింది. సెంట్రల్ జైలు సమీపంలోని ఒక అపార్ట్‌మెంట్ నుంచి గుర్తు తెలియని వ్యక్తి డ్రోన్ ఎగురవేశారు. సెంట్రల్ జైలు ఆవరణలోకి డ్రోన్ రావడంతో పోలీసులకు జైలు సూపరిటెండెంట్ రాహుల్ ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి (MP Mithun Reddy) ఇక్కడి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో డ్రోన్ ఎగురవేయటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డ్రోన్ ఎగురవేసిన సంఘటనపై సీరియస్‌గా స్పందించారు జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్. ఎస్పీ ఆదేశాలతో డ్రోన్ ఎగురవేసిన వ్యక్తిని గుర్తించారు పోలీసులు. చిన్న పిల్లోడు ఆడుకునేందుకు టాయ్ లాంటి డ్రోన్‌ను ఎగురవేసినట్లుగా గుర్తించారు పోలీసులు. సంబంధిత వ్యక్తిపై రాజమండ్రి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కోవూరులో ఉద్రిక్తత.. క్షమాపణలు చెప్పాలంటూ మహిళల డిమాండ్

జగన్ పర్యటన.. కేసులు నమోదు

For More AP News and Telugu News

Updated Date - Aug 01 , 2025 | 02:45 PM