MP Harish Madhur:టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఇండియాకు ఐదు దేశాల మద్దతు
ABN , Publish Date - Jun 17 , 2025 | 04:11 PM
ఆపరేషన్ సిందూర్‌ని ప్రారంభించి టెర్రరిజం అణచివేతకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ బాలయోగి తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలో గయానా, పనామా, కొలంబియా, బ్రెజిల్, యునైటెడ్ దేశాలను సందర్శించారు.

అంబేద్కర్ కోనసీమ (అమలాపురం): ఆపరేషన్ సిందూర్‌ని ప్రారంభించి టెర్రరిజం అణచివేతకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ బాలయోగి (MP Ganti Harish Madhur Balayogi) తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలో గయానా, పనామా, కొలంబియా, బ్రెజిల్, యునైటెడ్ దేశాలను సందర్శించారు. ఈ బృందంలో ఎంపీ హరీష్ బాలయోగి కూడా ఉన్నారు. ఢిల్లీకి తిరిగి వచ్చిన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు. ఐదు దేశాలతో దౌత్యపరమైన చర్చలు జరిపినట్లు వెల్లడించారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఐదు దేశాలు ఇండియాకు మద్దతిచ్చాయని అన్నారు. ఈ సందర్భంగా ఆ దేశాల ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు ఎంపీ గంటి హరీష్ మాధుర్.
మే 24వ తేదీ నుంచి జూన్ 5వ తేదీ వరకు వివిధ దేశాల్లో తాము పర్యటించామని ఎంపీ గంటి హరీష్ మాధుర్ వెల్లడించారు. యునైటెడ్ నేషన్స్ పర్యటన అనంతరం ఇండియాకు చేరుకున్నామని తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడదామని ఆయా దేశాలకు తాము వివరించామని అన్నారు. పాకిస్థాన్ మిలటరీ బేస్ క్యాంప్‌నకు ఇబ్బంది లేకుండా టెర్రరిస్టులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని భారత బలగాలు దాడులు చేశాయని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల నేతలతో కలిసి ఈ పర్యటన చేశామని చెప్పారు. న్యూయార్క్ 9/11 టెర్రరిస్ట్ దాడులను జ్ఞాపకం చేసుకుని, టెర్రరిజాన్ని అంతం చేయాలనే విషయాన్ని ఆయా దేశాల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశామని అన్నారు. తాము పర్యటించిన ప్రతి దేశంలో భారతదేశానికి మద్దతు లభించిందని గుర్తుచేశారు ఎంపీ గంటి హరీష్ మాధుర్.
టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఐదు దేశాల ప్రతినిధులకు భారతదేశం అండగా ఉంటుందని చెప్పామని ఎంపీ గంటి హరీష్ మాధుర్ అన్నారు. యుద్ధం పరిష్కారం కాదు కానీ టెర్రరిజం అంతం చేసే ప్రణాళికలకు అందరూ సహకరిస్తున్నారని అన్నారు. భార్య బిడ్డల ముందు పహల్గామ్‌లో భారత పర్యాటకులను పాకిస్థాన్ ఉగ్రవాదులు చంపడం నీచమైన చర్య అని... దీనినే ప్రపంచ దేశాలకు తెలియజేశామని చెప్పారు. ఇండియాతో కలసి రావటానికి ప్రపంచ దేశాలు మొగ్గు చూపాయని పేర్కొన్నారు ఎంపీ గంటి హరీష్ మాధుర్.
పాకిస్థాన్ చేస్తున్న తప్పుడు ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టామని ఎంపీ గంటి హరీష్ మాధుర్ అన్నారు. పాకిస్థాన్ చేస్తున్న కుట్రలను ప్రపంచ దేశాలకు తెలియజేశామని... వాస్తవాలను అందరూ గ్రహించారని చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌లో సామాన్యులకు, పౌరులకు ఎలాంటి హాని జరగలేదని గుర్తుచేశారు. పక్క ప్రణాళికతో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశామని పేర్కొన్నారు. ఈ అవకాశం తనకు కల్పించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎంపీ గంటి హరీష్ మాధుర్ బాలయోగి కృతఙ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి
సంచలనం.. షర్మిల కాల్స్ రికార్డ్.. అన్నకు సమాచారం
మా అమ్మ, బిడ్డలు ఏడుస్తున్నా పట్టించుకోలేదు.. శిరీష ఆవేదన
Read Latest AP News And Telugu News