Share News

Venkaiah Naidu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వెంకయ్య నాయుడు

ABN , Publish Date - Jul 28 , 2025 | 09:16 AM

తిరుమలలో వేంకటేశ్వర స్వామిని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కన్నడ హీరో శివరాజ్ కుమార్, దర్శకుడు గోపీచంద్, ఎమ్మెల్యేలు యశస్విని రెడ్డి, శ్రీధర్ దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

Venkaiah Naidu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వెంకయ్య నాయుడు
Venkaiah Naidu

తిరుమల: తిరుమలలో వేంకటేశ్వర స్వామిని (Tirumala Venkateswara Swamy Darshan) మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu),  కన్నడ హీరో శివరాజ్ కుమార్, దర్శకుడు గోపీచంద్, ఎమ్మెల్యేలు యశస్విని రెడ్డి, శ్రీధర్ దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో అన్న ప్రసాదాన్ని స్వీకరించడం ఆనందదాయకంగా ఉందని వ్యాఖ్యానించారు. అన్నప్రసాదాన్ని చాలా చక్కని రుచితో పాటు శుచిగా చేస్తున్నారని ప్రశంసించారు. నిత్యం వేలాది మంది భక్తులకు స్వామివారి అన్నప్రసాదం అందజేస్తున్నఈ కేంద్రం నిర్వహణా బృందానికి అభినందనలు తెలిపారు. ఈ స్పూర్తిని అన్ని ఆలయాలు ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షించారు వెంకయ్య నాయుడు.

Venkaiah-Naidu-1.jpg


శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకలను ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలతో పాటు భక్తుల సౌకర్యాల కల్పనకు మాత్రమే వినియోగించాలని వెంకయ్య నాయుడు సూచించారు. ప్రతి ఊరిలో ఓ గుడి, బడి ఉండాలని కోరారు. ప్రతి గ్రామంలో ఓ ఆలయాన్ని ఏర్పాటు చేయడానికి టీటీడీ లాంటి ధార్మిక సంస్థలు ముందుకు రావాలని సూచించారు. బడులను ఏర్పాటు చేయడం ప్రభుత్వ కర్తవ్యమని ఉద్ఘాటించారు. వీఐపీలు ఏడాదిలో ఒక్కసారి మాత్రమే స్వామివారి దర్శనానికి రావాలని పేర్కొన్నారు. టీటీడీ అధికారులు సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు సహకరించాలని కోరారు. ప్రజాప్రతినిధులు ఈ విధానాన్ని తప్పకుండా పాటించాలని వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు.

Venkaiah-Naidu-2.jpg


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ లిక్కర్‌ స్కాం ఢిల్లీ స్కాం కంటే పెద్దది: మంత్రి నిమ్మల

రాష్ట్రంలో పాజిటివ్‌ గవర్నెన్స్‌: మంత్రి సత్యప్రసాద్‌

Read latest AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 28 , 2025 | 09:34 AM