Home » Venkaiah Naidu
ఆపరేషన్ సిందూర్‌తో భారతదేశ శక్తి, సామర్థ్యాలు ప్రపంచానికి మరోమారు తెలిశాయని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు.
ఆపరేషన్ సిందూర్ కేవలం ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం కాదని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వెల్లడించారు. సాధారణ పౌరులకు ప్రమాదం లేకుండా ఆపరేషన్ చేపట్టడం త్రివిధ దళాల ప్రతిభకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.
వీఐపీలు సంవత్సరానికి ఒక్కసారే శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి తిరుమలకు రావాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు..
తిరుమలలో వేంకటేశ్వర స్వామిని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కన్నడ హీరో శివరాజ్ కుమార్, దర్శకుడు గోపీచంద్, ఎమ్మెల్యేలు యశస్విని రెడ్డి, శ్రీధర్ దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
హింసను ప్రోత్సహించే కొన్ని సినిమా డైలాగులను బాహాటంగానే కార్యకర్తలు చెబుతుండడం, కొందరు నాయకులు వారిని సమర్థిస్తుండడం విచారకరమని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు.
యాభై సంవత్సరాల క్రితం 1975లో అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ 21 నెలల పాటు దేశంలో అత్యయికస్థితిని (ఎమర్జెన్సీని) విధించారు. ఆమె తీసుకున్న ఈ నిరంకుశ నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతుల గురించి కొందరు నోళ్లు పారేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. . ఇలాంటి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు అత్యంత దారుణమైనవి, హేయమైనవని చెప్పారు.
Venkaiah Naidu:పహల్గామ్ ఉగ్రదాడి ప్రపంచ మానవాళి చరిత్రలోనే అత్యంత దుర్మార్గమైన, హేయమైన చర్య అని భారత గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తెలిపారు. మతం పేరు అడిగి మరీ 26 మంది అమాయకులను కాల్చి చంపటం అత్యంత దారుణమని వెంకయ్య నాయుడు అన్నారు.
కశ్మీర్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన శ్రీనగర్ పర్యటనను రద్దు చేసుకున్నారు. భద్రతా కారణాలవల్ల ఆయన తిరిగి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. అదే విధంగా హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తన ఆత్మకథ ‘జనతా కీ కహానీ మేరీ ఆత్మకథ’ పుస్తకావిష్కరణను వాయిదా వేశారు.
జమిలి ఎన్నికల ద్వారా దేశానికి సుస్థిర పాలన సాధ్యమవుతుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించటం వల్ల సమయం, ఖర్చు ఆదా అవుతుందని తెలిపారు