Share News

Venkaiah Naidu: నక్సల్స్ మూమెంట్ అంతరించే దశకు వచ్చింది.. వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Nov 08 , 2025 | 06:35 PM

నక్సల్స్‌పై కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. నక్సల్స్ మూమెంట్ వీక్ అయిపోయిందని విమర్శించారు. నక్సల్స్‌లో ఎవరికి వాళ్లు తమ సిద్ధాంతాలు చెబుతారని అన్నారు. కమ్యూనిస్టుల మధ్యే ఎన్నో విబేధాలు ఉన్నాయని ఆరోపించారు వెంకయ్య నాయుడు.

 Venkaiah Naidu: నక్సల్స్ మూమెంట్ అంతరించే దశకు వచ్చింది.. వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు
Venkaiah Naidu

ఢిల్లీ, నవంబరు8 (ఆంధ్రజ్యోతి): వందేమాతరాన్ని యువత స్ఫూర్తిగా తీసుకొని భారతదేశ అభివృద్ధి కోసం పని చేయాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) సూచించారు. ఇండియా ఎదుగుదలను చూసి పక్క దేశాలు అసూయ పడుతున్న తరుణంలో, భారతదేశ యువత మరింత మెరుగ్గా పని చేసి మన సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితాను సరి చూసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిది మాత్రమే కాదని.. ఆయా రాజకీయ పార్టీలది కూడా అని సూచించారు. ఓటర్ల జాబితాలో కూడికలు, తీసివేతలు సహజమేనని.. వాటిని రాజకీయ పార్టీలు పరిశీలించుకోవాలని పేర్కొన్నారు వెంకయ్య నాయుడు.


ఇవాళ(శనివారం) బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీ జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు ఈక్రమంలో ఢిల్లీలోని ఎల్కే అద్వానీ నివాసానికి వెంకయ్య నాయుడు వెళ్లి కలిశారు. ఈ నేపథ్యంలో ఎల్కే అద్వానీకి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీడియాతో వెంకయ్య నాయుడు మాట్లాడారు. భారత రాజకీయాల్లో మహోన్నత వ్యక్తి, ఉక్కు మనిషి శ్రీ లాల్ కృష్ణ అద్వానీ పుట్టినరోజు ఈరోజు అని తెలిపారు. ఎల్కే అద్వానీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి తాను ఢిల్లీ వచ్చానని పేర్కొన్నారు వెంకయ్య నాయుడు.


అద్వానీకి ఉన్న దేశభక్తి, క్రమశిక్షణ, అంకితభావం యువతకు ఆదర్శప్రాయమని కీర్తించారు. దేవుడు ఆయనకు పరిపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. ఎల్కే అద్వానీ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. నక్సల్స్ మూమెంట్ దాదాపు అంతరించిపోయే దశకు వచ్చిందని.. ఇది మంచిదేనని చెప్పుకొచ్చారు. నక్సల్స్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. నక్సల్స్ మూమెంట్ వీక్ అయిపోయిందని విమర్శించారు. నక్సల్స్‌లో ఎవరికి వాళ్లే తమ సిద్ధాంతాలు చెబుతారని అన్నారు. కమ్యూనిస్టుల మధ్యే ఎన్నో విబేధాలు ఉన్నాయని ఆరోపించారు వెంకయ్య నాయుడు.


మొదట్లో నక్సల్‌కు ప్రజల మద్దతు ఉండేదని తెలిపారు. అయితే, బుల్లెట్ కంటే బ్యాలెట్ పవర్ ఫుల్ అని ఉద్ఘాటించారు. సోషల్ మీడియాని నియంత్రించాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. ఎల్కే అద్వానీ క్రౌడ్ పుల్లర్‌గా ఉండే వారని అభివర్ణించారు. 2014లో నరేంద్రమోదీ శకం మొదలు పెట్టాల్సి వచ్చిందని గుర్తుచేశారు. అప్పటికే గుజరాత్ మోడల్‌పై దేశవ్యాప్తంగా చర్చ జరిగిందని తెలిపారు. గుజరాత్‌లో ఆ సమయంలో నరేంద్ర మోదీ సక్సెస్ ఫుల్ చీఫ్ మినిస్టర్‌గా ఉన్నారని నొక్కిచెప్పారు. ప్రపంచంలో మల్టీనేషనల్ కంపెనీలను భారతీయులు కొనసాగిస్తున్నారని వివరించారు. అమెరికాలో పరిస్థితి దాదాపుగా మారిందని అన్నారు. ఆయా ఎన్నికల్లో భారతీయ సంతతి వాళ్లు గెలుస్తున్నారని తెలిపారు. ఇండియా ఇతర దేశాలతో పోలిస్తే చాలా తెలివైనదని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

అర్ధరాత్రి నడిరోడ్డుపై మందుబాబుల హంగామా.. ఏం జరిగిందంటే

కుప్పంలో ఏడు ప్రాజెక్టులకు శంకుస్థాపన.. భారీగా ఉద్యోగావకాశాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 08 , 2025 | 07:41 PM