ఓపెన్ ఏఐ తాజాగా చాట్‌జీపీటీకి షాపింగ్ ఫీచర్ కూడా జోడించింది. ఉత్పత్తుల ధరలు, ఫీచర్లు, ప్రాడక్ట్ రివ్యూల మధ్య పోల్చి చూసి నచ్చినది ఎంచుకునేందుకు వీలుగా ఈ ఫీచర్‌ను డిజైన్ చేసింది.
Meta AI Chatbot: నియమాన్ని అతిక్రమించి ఏఐ చాట్బాట్లో అశ్లీల సంభాషణలు సాగుతున్నాయి. అది కూడా చిన్న పిల్లలతో ఆ చాట్బాట్లు అశ్లీలకర సంభాషణలను కొనసాగిస్తున్నాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ దర్యాప్తులో ఈ విషయాలు బయటపడ్డాయి. కొద్దిరోజుల క్రితం 14 ఏళ్ల బాలిక జాన్ సినా వాయిస్ ఉన్న ఏఐ చాట్‌బాట్‌తో సంభాషించింది.
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య పరిస్థితులు మరింత కఠినంగా మారుతున్నాయి. ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్న భారత ప్రభుత్వం, తాజాగా పాకిస్తాన్‌కు చెందిన 16 యూట్యూబ్ ఛానెళ్లను నిషేధించింది. వీటిలో మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఛానెల్ కూడా ఉంది.
WhatsApp Messaging Tips After Block: కోపం, అసహనం పెరిగిపోయినప్పుడు అవతలి వ్యక్తి నంబర్ బ్లాక్ చేయడం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో వాట్సాప్ ద్వారా వారికి మెసేజ్ చేయడం కుదరదు అనే అనుకుంటాం. కానీ, ఈ టిప్స్ పాటిస్తే గనక మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తికి మెసేజ్ చేయవచ్చు.
ప్రస్తుతం ఎన్నో చాట్‌జీపీటీ చాట్ బాట్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఏవి ఎప్పుడు వాడాలో ఈ కథనంలో తెలుసుకుందాం.
మీ స్మార్ట్‌ఫోన్‌తో మీ ఎయిర్ కండిషనర్ను నియంత్రించవచ్చని మీకు తెలుసా? ఈ సింపుల్ ట్రిక్ మీ ACని ఆన్ లేదా ఆఫ్ చేయడానికి, ఉష్ణోగ్రతను తగ్గించడానికి లేదా పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రపంచపు అతిపెద్ద డిజిటల్ వీడియో సర్వీస్ వేదిక యూట్యూబ్ ఉనికిలోకి వచ్చి20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ ప్రయాణంలో కీలక మైలురాళ్ల గురించి యూట్యూబ్ తాజాగా పంచుకుంది.
ఈ-కామర్స్‌లో భాగమయ్యేందుకు చాట్‌జీపీటీ ప్రయత్నిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఈ దిశగా షాపిఫైతో చాట్‌జీపీటీ అనుసంధానం చేసేందుకు చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
టెలికాం యూజర్ల ఇబ్బందులను తొలగించేందుకు ట్రాయ్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో TRAI కొత్త పోర్టల్‌ను ప్రారంభించింది. దీని ద్వారా వినియోగదారులు ఈజీగా ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది.
రోజురోజుకు సైబర్ దాడులు పెరుగుతుండడంతో.. వాటి నుంచి ఐఫోన్లను రక్షణ కల్పించే దిశగా ఆపిల్ కంపెనీ కొత్త అప్డేట్ను తీసుకొచ్చింది. iOS 18.4.1 పేరుతో కొత్త సెక్యూరిటీ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది..