Google Meet outage: గూగుల్ మీట్ సేవల్లో అంతరాయం.. మీటింగ్‌లకు జాయిన్ కాలేక యూజర్ల గగ్గోలు..
ABN , Publish Date - Nov 26 , 2025 | 02:43 PM
గూగుల్ మీట్‌లో ఎదురైన సమస్యలపై యూజర్లు 'ఎక్స్' (గతంలో ట్విటర్) వేదికగా తమ నిరాశను, అసంతృప్తిని పంచుకున్నారు. కాగా, గూగుల్ మీట్ డౌన్ కావడంపై కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు
గూగుల్ మీట్ (Google Meet) సేవలు బుధవారం దేశవ్యాప్తంగా ఒక్కసారిగా నిలిచిపోయాయి. ఆన్‌లైన్ మీటింగ్‌లకు అటెండ్ కావడానికి ప్రయత్నించిన వేలాది మంది యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అవుట్‌టేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ Downdetector.in ప్రకారం, గూగుల్ మీట్‌లో కనెక్టివిటీ సమస్యలకు సంబంధించి దాదాపు 2,000 ఫిర్యాదులు నమోదు అయ్యాయి. మీటింగ్స్‌లో చేరేందుకు ప్రయత్నించిన యూజర్లకు స్క్రీన్‌పై ఒక ఎర్రర్ మెసేజ్ కనిపించింది (Google Meet down).
'502. దట్ ఈజ్ ఆన్ ఎర్రర్. సర్వర్ తాత్కాలిక లోపాన్ని ఎదుర్కొంటోంది. మీ అభ్యర్థనను పూర్తి చేయలేకపోయాము. దయచేసి 30 సెకన్లలో మళ్లీ ప్రయత్నించండి' అనే సందేశాన్ని చూపించింది. గూగుల్ మీట్‌లో ఎదురైన సమస్యలపై యూజర్లు 'ఎక్స్' (గతంలో ట్విటర్) వేదికగా తమ నిరాశను, అసంతృప్తిని పంచుకున్నారు. కాగా, గూగుల్ మీట్ డౌన్ కావడంపై కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు (Google Meet problem).
తనకు పని చేయాలనే కోరిక చచ్చిపోకముందే, గూగుల్ మీట్ క్రాష్ అయ్యిందని ఒక యూజర్ కామెంట్ చేశారు (Google Meet disruption). గూగుల్ మీట్ ఓపెన్ కావడం లేదని, తనకు ఇంత స్వేచ్ఛ ఎప్పుడూ దొరకలేదని మరొకరు ఫన్నీగా పేర్కొన్నారు. తన సంస్థలో అందరికీ గూగుల్ మీట్ డౌన్ అయ్యిందని, కానీ తనకు మాత్రం బాగానే ఉందని మరొకరు తెలిపారు. 'గూగుల్ మీట్ ఆగిపోయింది, కార్పొరేట్ ప్రపంచం బాగానే ఉందా' అని మరొకరు ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజ్యాంగ విలువలను కాపాడుకుంటాం:సీఎం చంద్రబాబు
మాక్ అసెంబ్లీ అద్భుతం.. విద్యార్థులు అదరగొట్టారు: సీఎం చంద్రబాబు