Share News

Aus Social Media Ban: టీనేజర్ల సోషల్ మీడియా అకౌంట్స్‌పై బ్యాన్.. ఆస్ట్రేలియాను వీడుతున్న కంటెంట్ క్రియేటర్లు

ABN , Publish Date - Nov 24 , 2025 | 10:53 PM

ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల లోపు టీనేజర్ల సోషల్ మీడియా అకౌంట్స్‌పై నిషేధం విధించిన నేపథ్యంలో అక్కడి కంటెంట్ క్రియేటర్లు దేశాన్ని వీడే యోచనలో ఉన్నారు. టీనేజర్లు సోషల్ మీడియాకు దూరమైతే వ్యూస్, యాడ్స్‌పై వచ్చే ఆదాయం తగ్గుతుందన్న అంచనాతో ఈ నిర్ణయం తీసుకుంటున్నారు.

Aus Social Media Ban: టీనేజర్ల సోషల్ మీడియా అకౌంట్స్‌పై బ్యాన్.. ఆస్ట్రేలియాను వీడుతున్న కంటెంట్ క్రియేటర్లు
Australia Teen Social Media Ban Effects

ఇంటర్నెట్ డెస్క్: పదహారేళ్ల లోపు టీనేజర్లకు సోషల్ మీడియా అకౌంట్స్ లేకుండా ఆస్ట్రేలియా నిషేధం విధించిన విషయం తెలిసిందే. చిన్నారులపై సోషల్ మీడియా చెడు ప్రభావం పడకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచీ ఈ నిషేధం అమల్లోకి రానుంది. అయితే, దీని ప్రభావం అక్కడి కంటెంట్ క్రియేటర్లపై పడింది. ఆస్ట్రేలియాలో తమ రాబడి తగ్గే అవకాశం ఉండటంతో అనేక మంది కంటెంట్ క్రియేటర్లు దేశాన్ని వీడుతున్నారు (Impact of Australia Teen Social Media Ban).

ఆస్ట్రేలియాలోని ప్రముఖ యూట్యూబర్ జోర్డాన్ బార్క్‌లే కూడా దేశాన్ని వీడే యోచనలో ఉన్నారు. గేమింగ్ కంటెంట్ క్రియేషన్ ఆధారంగా అతడు 50 మిలియన్ డాలర్ల విలువైన కంపెనీని నెలకొల్పాడు. త్వరలో టీనేజర్ల సోషల్ మీడియా అకౌంట్స్‌పై నిషేధం అమల్లోకి రానున్న నేపథ్యంలో అతడు తను పుట్టి పెరిగిన మెల్‌బోర్న్ నగరాన్ని వీడి విదేశాలకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాడు.


అంతర్జాతీయ కథనాల ప్రకారం, ఆస్ట్రేలియా సోషల్ మీడియా రంగం ఏటా 9 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఇస్తోంది. అయితే 16 ఏళ్ల లోపు టీనేజర్ల సోషల్ మీడియాకు దూరమయ్యాక కంటెంట్ క్రియేటర్లకు ఫాలోవర్‌లను పెంచుకోవడం కష్టంగా మారుతుంది. ఫలితంగా వ్యూస్ గణనీయంగా తగ్గుతాయి. దీంతో, కంపెనీలు, సంస్థలు ఆస్ట్రేలియా సోషల్ మీడియాలో యాడ్స్‌ ఖర్చును తగ్గించుకుంటాయి. అంతిమంగా కంటెంట్ క్రియేటర్‌లు ఆర్థికంగా నష్టపోతారు. ఇన్‌ఫ్లుయెన్సర్‌ల వ్యవస్థకు ఇది గొడ్డలి పెట్టని నిపుణులు చెబుతున్నారు. స్థానిక ఫాలోవర్‌లు అధికంగా ఉన్న చిన్న కంటెంట్ క్రియేటర్లపై ఈ ప్రభావం అధికంగా ఉంటుందన్న భయాలు నెలకొన్నాయి.

యూట్యూబ్‌తో పాటు, టిక్‌టాక్, ఇన్‌స్టా‌లోని 16 ఏళ్ల లోపు వయసున్న వారి అకౌంట్‌లు అన్నింటిపై ఈ వేటు పడనుంది. ఇక నిషేధం అమల్లోకి వచ్చాక చిన్నారులకు సోషల్ మీడియా యాప్స్‌లో లాగిన్ కాకుండా వీడియోలు చూసే అవకాశం మాత్రమే ఉంటుంది. ఈ నేపపథ్యంలో ఇప్పటికే స్పాన్సర్‌‌షిప్‌లు తగ్గిపోయాయని కొందరు ఆస్ట్రేలియా కంటెంట్ క్రియేటర్లు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమకు అమెరికా మంచి ప్రత్యామ్నాయం అని అంటున్నారు.


ఇవి కూడా చదవండి:

ఏఐని గుడ్డిగా నమ్మొద్దు.. ఆల్ఫబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ హెచ్చరిక

పర్‌ప్లెక్సిటీ ఏఐ సంస్థ విఫలమయ్యే ఛాన్స్ అత్యధికం.. లైవ్‌ పోల్‌లో జనాభిప్రాయం

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 25 , 2025 | 07:45 AM