అంబేడ్కర్ ఆశయసాధనకు కృషి
ABN , Publish Date - Nov 24 , 2025 | 11:41 PM
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయసాధనకు ప్రతీ ఒక్కరు కృషిచేయాలని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి పిలుపునిచ్చారు.
వెల్దండ, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయసాధనకు ప్రతీ ఒక్కరు కృషిచేయాలని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి పిలుపునిచ్చారు. సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని గుండాల గ్రామంలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ, బండోనిపల్లి, పల్గుతండాలలో గ్రామపంచాయతీ భవనాల ప్రారంభం, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాలలో స్థానిక ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ఎంపీ మల్లురవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేడ్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తిదాయకమన్నారు. సమానత్వం, స్వేచ్ఛ రాజ్యాంగంతోనే సాధ్యపడిందన్నారు. ఇందిరమ్మ రాజ్యస్థాపనే ధ్యేయంగా సంక్షేమపథకాలను అమలుచేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ చెర్మన్ గీత, విశ్రాంత ఐఆర్‌ఎస్ అధికారి లక్ష్మణ్‌నాయక్, నాయకులు తదితరులు ఉన్నారు.