Share News

iPhone Foldable: ఫోల్డబుల్ ఐఫోన్.. కీలక వివరాలు లీక్.. దిమ్మతిరిగే ఫీచర్స్

ABN , Publish Date - Nov 25 , 2025 | 02:45 PM

ఫోల్డబుల్ ఐఫోన్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఓ గుడ్ న్యూస్. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో ఇది జనాల ముందుకు వచ్చే అవకాశం ఉందని టెక్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఫీచర్స్ కూడా అద్భుతంగా ఉంటాయట.

iPhone Foldable: ఫోల్డబుల్ ఐఫోన్.. కీలక వివరాలు లీక్.. దిమ్మతిరిగే ఫీచర్స్
Iphone Foldable

ఇంటర్నెట్ డెస్క్: ఐఫోన్ ప్రియులు ఎంతోకాలంగా ఫోల్డబుల్ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సెగ్మెంట్‌లో పాతుకుపోయిన శాంసంగ్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు యాపిల్ సంస్థ కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో టెక్ వర్గాల్లో ఓ వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. వచ్చే ఏడాది యాపిల్ తన ఫోల్డబుల్ ఐఫోన్‌ను జనాల ముందుకు తెచ్చే అవకాశం మెండుగా ఉందట. ఈ ఫోన్‌కు సంబంధించిన పలు ఆసక్తికర ఫీచర్స్‌ గురించిన వివరాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఐఫోన్ అభిమానుల్లో ఉత్కంఠను పతాకస్థాయికి తీసుకెళుతున్నాయి (iPhone Foldable).

టెక్ వెబ్ సైట్స్ కథనాల ప్రకారం, ఐఫోన్ 18 ప్రో సిరీస్‌లో భాగంగా ఫోల్డబుల్ ఐఫోన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్‌లో లోపలి స్క్రీన్ వైపు 24 ఎంపీ కెమెరా ఏర్పాటు చేశారు. ఇప్పటివరకూ ఉన్న బ్రాండ్స్ అన్నీ 4 ఎంపీ లేదా 8 ఎంపీ కెమెరా ఆఫర్ చేస్తున్న విషయం తెలిసిందే. కాబట్టి, 24 ఎంపీ కెమెరా ఏర్పాటు నిజమైతే ఇది పెను సంచలనం కాక తప్పదు. ఔటర్ స్క్రీన్‌పై సెల్ఫీ కెమెరా, వెనకవైపు 48 ఎంపీ డ్యూయెల్ కెమెరా కూడా ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసినట్టు సమాచారం


ఐఫోన్ బ్యాటరీ సామర్థ్యం కూడా అద్భుతంగా ఉండనుందని సమాచారం. 5400-5800 ఎమ్ఏహెచ్ సామర్థ్యం ఉన్న బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. 5.5 అంగుళాల ఔటర్ కవర్‌ డిస్‌ప్లేతో, 7.8 అంగుళాల మెయిన్ డిస్‌ప్లేతో ఈ ఫోన్‌ను డిజైన్ చేశారు. ఇప్పటివరకూ ఫోన్ అన్‌లాకింగ్ కోసం ఫేస్ ఐడీపై ఆధారపడ్డ యాపిల్.. తన ఫోల్డబుల్ ఫోన్‌లో టచ్ ఐడీ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఫోల్డబుల్ ఫోన్ పక్కా అన్న వార్త సంచలనంగా మారినప్పటికీ ఈ విషయంలో యాపిల్ గుంభనంగా ఉంటోంది. ఇప్పటివరకూ ఫోన్ లాంచ్‌పై ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు.


ఇవి కూడా చదవండి:

టీనేజర్ల సోషల్ మీడియా అకౌంట్స్‌పై బ్యాన్.. ఆస్ట్రేలియాను వీడుతున్న కంటెంట్ క్రియేటర్లు

ఏఐని గుడ్డిగా నమ్మొద్దు.. ఆల్ఫబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ హెచ్చరిక

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 25 , 2025 | 10:15 PM