Home » Nitish Kumar
బిహార్ రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ నేతల వ్యాఖ్యలు, ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. ఇటీవల కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) చీఫ్ చిరాగ్ పాస్వాన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
బిహార్‌లో హోం గార్డ్ రిక్రూట్‌మెంట్‌కు హాజరైన 26 ఏళ్ల మహిళ స్పృహతప్పిపోవడం, అంబులెన్స్‌లోనే ఆమెపై అత్యాచారం జరిగిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన నేపథ్యంలో పాశ్వాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రజాస్వామానికి నాలుగో మూలస్తంభం పాత్రికేయులను, సామాజిక అభివృద్ధిలో వారి పాత్ర కీలకమని నితీష్ ఈ సందర్భంగా అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరుగనున్న నేపథ్యంలో నితీష్ తాజా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.
యువకుల్లో తేజస్వికి మంచి పాపులారిటీ ఉన్నట్టు సర్వే తెలిపింది. ఆయన ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని 25-34 సంవత్సరాల మధ్య ఉన్న 40 శాతం మంది యువకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. 22 మంది నితీష్ వైపు మొగ్గుచూపారు.
జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా వెనుక బీజేపీ కుట్ర కనిపిస్తోందని అఖ్తరుల్ అన్నారు. ఉపరాష్ట్రపతి వంటి రాజకీయ ప్రాధాన్యం లేని పదవిని ఇచ్చి నితీష్‌ను తప్పించాలని బీజేపీ భావిస్తోందని చెప్పారు.
ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలంగా సేవలందించిన 75 ఏళ్ల నితీష్ కుమార్ మరోసారి అధికారాన్ని ఆశిస్తున్నారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేలో జేడీయూ, చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ భాగస్వామిగా ఉన్నాయి.
అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. రాష్ట్ర ప్రజలకు బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఉచిత విద్యుత్ పథకం ప్రకటించారు. గృహ వినియోగదారులందరికి ప్రతినెల 125 యూనిట్ల విద్యుత్ ఉచితంగా పంపిణీ చేస్తామని గురువారం సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
Free Electricity: ప్రజలకు ముఖ్యమంత్రి గుడ్‌న్యూస్ చెప్పారు. ఆగస్టు నుంచి ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పారు. ఇక, 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 1.67 కోట్ల మంది ప్రజలు లబ్ది పొందనున్నారు.
2030 కల్లా కోటి ఉద్యోగాల కల్పనకు పారిశ్రామిక రంగంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రైవేటురంగంలో విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. ఇందుకు సంబంధించి ఉపాధితా విస్తరణ ప్లానింగ్, అమలు కోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
ఎంపిక చేసిన ప్రభుత్వ సర్వీసులలో బీహార్‌లోని మహిళలకు ఇప్పటికే రిజర్వేషన్ ఉండగా, తాజా నిర్ణయం ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలు, రిక్రూట్‌మెంట్ స్థాయిలలో శాశ్వత నివాసిత మహిళలకు 35 శాతం కోటా వర్తిస్తుంది.