Share News

Nitish Kumar: జేడీయూ శాసనసభా పక్ష నేతగా నితీశ్ ఎన్నిక

ABN , Publish Date - Nov 19 , 2025 | 02:42 PM

నితీశ్ కుమార్ బుధవారం సాయంత్రం గవర్నర్‌ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌ను కలుసుకునే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా గవర్నర్‌కు ఆయన విజ్ఞప్తి చేయనున్నారు. ఎన్డీయే నేతల మద్దతు లేఖను కూడా ఆయన గవర్నర్‌కు అందజేస్తారు.

Nitish Kumar: జేడీయూ శాసనసభా పక్ష నేతగా నితీశ్ ఎన్నిక
Nitish Kumar

పాట్నా: జనతా దళ్ యునైటెడ్ (JDU) శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ చీఫ్ నితీశ్ కుమార్ (Nitish Kumar) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాట్నాలో బుధవారంనాడు జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో నితీశ్ ఎన్నిక జరిగింది. దీంతో ఈరోజు సాయంత్రం ఎన్డీయే నేతగా నితీశ్ ఎన్నికయ్యేందుకు మార్గం సుగమమైంది. నితీశ్ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఈనెల 20న ప్రమాణస్వీకారం చేయనున్నట్టు పార్టీ నేతలు తెలిపారు.


గవర్నర్‌ను కలుసుకోనున్న నితీశ్

నితీశ్ కుమార్ బుధవారం సాయంత్రం గవర్నర్‌ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌ను కలుసుకునే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా గవర్నర్‌కు ఆయన విజ్ఞప్తి చేయనున్నారు. ఎన్డీయే నేతల మద్దతు లేఖను కూడా గవర్నర్‌కు అందజేస్తారు.


పదవసారి ముఖ్యమంత్రిగా

నితీశ్ కుమార్ రికార్డు స్థాయిలో 10వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పాట్నాలోని గాంధీ మైదానంలో 20వ తేదీ మధ్యాహ్నం 11.30 గంటలకు ప్రమాణస్వీకారం ఉంటుంది. ఈ కార్యక్రమ సన్నాహకాలను నితీశ్ మంగళవారంనాడు స్వయంగా సమీక్షించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీయే పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు ఈ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరవుతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజధానిలోనూ, గాంధీ మైదాన్ చుట్టూ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.


ఎన్డీయే కూటమి ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 243 స్థానాలకు 202 సీట్లు గెలిచి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. మహాగఠ్‌బంధన్ 35 స్థానాలకే పరిమితమైంది. ఎన్డీయే కూటమిలోని బీజేపీ 89 సీట్లు, జేడీయూ 85 సీట్లు, ఎల్‌జేపీఆర్‌వీ 19, హెఏఎంఎస్ 5, ఆర్ఎల్ఎం 4 సీట్లు గెలుచుకున్నాయి. మహాకూటమిలోని ఆర్జేడీ 25 సీట్లు, కాంగ్రెస్ 6, సీపీఐఎంఎల్ 2, ఐఐపీ 1, సీపీఎం 1 స్థానం గెలుచుకున్నాయి. స్వతంత్రంగా పోటీ చేసిన ఏఐఎంఐఎం 5, బీఎస్‌పీ ఒక సీటు గెలుచుకున్నాయి.


ఇవి కూడా చదవండి..

ఎర్రకోట బ్లాస్ట్‌లో షాకింగ్ అప్‌డేట్.. పార్కింగ్ లాట్‌లోనే బాంబు తయారు చేసి..

టీవీకే సభ్యులకు క్యూ ఆర్‌ కోడ్‌తో గుర్తింపు కార్డులు

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 19 , 2025 | 02:50 PM