Share News

Al Falah University ED custody: ఈడీ కస్టడీకి అల్-ఫలాహ్ యూనివర్సిటీ చైర్మన్..

ABN , Publish Date - Nov 19 , 2025 | 11:35 AM

అల్-ఫలాహ్ యూనివర్సిటీ చైర్మన్ జావద్ అహ్మద్ సిద్ధిఖీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద సిద్ధిఖీని ఈడీ అరెస్ట్ చేసింది. మంగళవారం అరెస్ట్ చేసిన సిద్ధిఖీని ఈ రోజు సాకేత్ కోర్టులో ఈడీ హాజరు పరిచింది.

Al Falah University ED custody: ఈడీ కస్టడీకి అల్-ఫలాహ్ యూనివర్సిటీ చైర్మన్..
Jawad Ahmed Siddiqi ED

ఢిల్లీ ఎర్రకోట పేలుళ్ళల్లో కీలకంగా నిలిచిన ఫరీదాబాద్ అల్-ఫలాహ్ యూనివర్సిటీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆ సంస్థ చైర్మన్ జావద్ అహ్మద్ సిద్ధిఖీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA)కింద సిద్ధిఖీని ఈడీ అరెస్ట్ చేసింది. మంగళవారం అరెస్ట్ చేసిన సిద్ధిఖీని ఈ రోజు సాకేత్ కోర్టులో ఈడీ హాజరు పరిచింది (Jawad Ahmed Siddiqi ED).


మనీ లాండరింగ్ కేసులో విచారణ నిమిత్తం 13 రోజుల పాటు సిద్ధిఖీని ఈడీ కస్టడీకి అప్పగించడానికి కోర్టు అనుమతించింది. ఫీజుల రూపంలో వసూలు చేసిన రూ. 415 కోట్లు మొత్తాన్ని నకిలీ అకౌంట్ల ద్వారా హవాలా మార్గంలో సిద్ధిఖీ మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. సిద్ధిఖీ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. నిధుల మళ్లింపు, మనీలాండరింగ్‎కు పాల్పడినట్లు నిర్ధారించుకుంది. అలాగే NAAC, UGC అక్రిడిటేషన్ లేకున్నా ఉన్నట్లుగా విద్యార్థులను తప్పుదారి పట్టించినట్లు గుర్తించిన ఈడీ ఈ విషయంపై కూడా విచారించనుంది (Al Falah money laundering case).


ఢిల్లీ పేలుళ్ళకు సంబంధించి ఇప్పటి వరకు అరెస్ట్ అయిన ఉగ్రవాదులు అందరూ అల్ ఫలాహ్ యూనివర్శిటీకి చెందినవారే (ED raids Al Falah). ఢిల్లీ ఎర్రకోట పేలుళ్ళల్లో ఇప్పటి వరకు 15 మంది మృతి చెందారు. ఇంకా కొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. యావత్ దేశాన్ని కుదిపేసిన ఈ ఘటనను ఉగ్రదాడిగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకి అప్పగించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

హిడ్మా ఎన్‌కౌంటర్.. ప్రొ.హరగోపాల్ కీలక వ్యాఖ్యలు

అందుకే మారేడుమిల్లికి వచ్చిన మావోయిస్టులు.. జిల్లా ఎస్పీ

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 19 , 2025 | 12:22 PM