Nitish Kumar: నితేషే మళ్లీ సీఎం.. ప్రమాణ స్వీకారానికి మోదీ
ABN , Publish Date - Nov 14 , 2025 | 03:45 PM
బీజేపీ 95 సీట్లలో గెలుపును ఖాయం చేసుకుని రాష్ట్రంలో ఏకైక పెద్ద పార్టీగా అవతరించనుండగా, జేడీయూ 82 సీట్లలోనూ, ఎల్‌జేపీ 19, హెచ్ఏఎం 5, ఆర్ఎల్ఎం 4 సీట్లలో గెలుపును ఖాయం చేసుకున్నాయి.
పాట్నా: జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ (Nitish Kuamr) వరుసగా తొమ్మిదో సారి బిహార్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడానికి మార్గం సుగమమైంది. నితీష్ ప్రమాణస్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) వస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్‌లో ఎన్డీయే 205 సీట్లలో గెలుపును దాదాపు ఖరారు చేసుకుని భారీ విజయాన్ని నమోదు చేసుకోనుంది.
కౌంటింగ్ ప్రతిదశలోనూ విపక్ష మహాగఠ్‌బంధన్‌పై ఎన్డీయే ఆధిపత్యం కొసాగుతూ వచ్చింది. తుది ఫలితాలు సాయంత్రానికల్లా వెలువడే అవకాశాలున్నాయి., ఎన్డీయే 205 సీట్లలో సత్తా చాటుతోంది. మహాగఠ్‌బంధన్ 31 సీట్లలో ముందంజలో ఉంది.
బీజేపీ 95 సీట్లలో గెలుపును ఖాయం చేసుకుని రాష్ట్రంలో ఏకైక పెద్ద పార్టీగా అవతరించనుండగా, జేడీయూ 82 సీట్లలోనూ, ఎల్‌జేపీ 19, హెచ్ఏఎం 5, ఆర్ఎల్ఎం 4 సీట్లలో గెలుపును ఖాయం చేసుకున్నాయి. విపక్ష ఆర్జేడీ 26, కాంగ్రెస్ 3, వామపక్షాలు 2 సీట్లలో గెలుపును ఖాయం చేసుకోగా, తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీ ఖాతా కూడా తెరిచే అవకాశాలు కనిపించడం లేదు. ఏఐఎంఐఎం 6, ఇతరుల ఒక స్థానంలో గెలుపునకు మార్గం సుగమం చేసుకున్నాయి.
దూసుకెళ్లిన జేడీయూ
ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన టీమ్ గట్టి సపోర్ట్ ఇవ్వడం జేడీయూ విజయావకాశాలను మరింత మెరుగుపరిచింది. 2020లో కేవలం 40 సీట్లలో గెలిచిన జేడీయూ ఈసారి 80కి పైగా సీట్లలో సత్తా చాటుతోంది.
ఇవి కూడా చదవండి..
ఎన్డీయే విజయోత్సాహం.. పార్టీ ప్రధానకార్యాలయానికి మోదీ
బిహార్‌లో గెలుపు మాదే.. ఇక బెంగాల్‌లోనూ..: కేంద్ర మంత్రి
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.