Nitish Kumar: ఆపేదెవరు.. బీహార్‌లో నితీశ్ ఏకఛత్రాధిపత్యం..
ABN , Publish Date - Nov 14 , 2025 | 01:10 PM
ఎన్నికల్లో ఏ పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చినా, ఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినా నితీశ్ మాత్రం సీఎంగానే కొనసాగుతున్నారు. అయితే ఈసారి నితీశ్ పార్టీ గెలుపు కష్టమని చాలా మంది అంచనా వేశారు.
బీహార్‌లో గత రెండు దశాబ్దాలుగా నితీశ్ కుమార్ ఏకఛత్రాధిపత్యం సాగిస్తున్నారు. ఏ కూటమి అధికారంలోకి వచ్చినా ముఖ్యమంత్రి స్థానంలో మాత్రం నితీశ్ కొనసాగుతున్నారు. గత 20 ఏళ్లుగా బీహార్ ముఖ్యమంత్రి కుర్చీ నుంచి నితీశ్ లేవడం లేదు (2014-2015లో ఒక ఏడాది మినహా). ఎన్నికల్లో ఏ పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చినా, ఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినా నితీశ్ మాత్రం సీఎంగానే కొనసాగుతున్నారు. అయితే ఈసారి నితీశ్ పార్టీ గెలుపు కష్టమని చాలా మంది అంచనా వేశారు (Bihar politics).
వయస్సు అయిపోయిందన్నారు.. ఈసారి కష్టం అన్నారు. అయినా నితీశ్ మాత్రం దూసుకుపోతున్నారు. దాదాపు రెండింతల సీట్లు గెలిచే దారిలో నితీశ్ పార్టీ అయిన జనతాదళ్ ఉంది. ఎన్నో డ్రామాలతో నిండిన బీహార్ రాజకీయాల్లో నితీశ్ మకుటం లేని మహారాజులా వెలుగొందుతున్నారు. సాధారణ కుర్మీ కుటుంబంలో జన్మించిన నితీశ్, చిన్నప్పుడు రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నారు. అయితే 1970ల చివర్లో జేపీ ఉద్యమంతో ప్రజా జీవనంలోకి అడుగుపెట్టిన నితీశ్ రాజకీయ ప్రయాణం ఓ మహాకథగా మారింది. నితీశ్ ఎదుగుదల ఒక్కరోజులో జరగలేదు. నిశ్శబ్దం, పట్టుదల, కష్టపడి పనిచేయడం.. ఇవే ఆయణ్ని ముందుకు నడిపించాయి (Nitish Kumar biography).
పాత వారిని వదులుకోవడం, కొత్త కూటములు కట్టడం, మళ్లీ పాత వాటిలోకి తిరిగి పోవడం.. నితీశ్ నిర్ణయాలు ఎప్పుడూ ధైర్యంగా, ఊహించని విధంగా ఉంటాయి. ఎప్పుడు ఏ కూటమిలోకి వెళ్లాలి, ఏ సమయంలో ఏ కూటమి నుంచి బయటికి రావాలి అనేది నితీష్ కుమార్ బాగా అవపోసన పట్టేశారు. ఏమి చేసినా, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నితీశ్ అడుగు ముందుకే పడింది. ఏది ఏమైనా బీహార్ వాసుల జీవితాలను కొంతమేరకు అయినా మెరుగుపరిచిన నాయకుడిగా నితీశ్ మన్ననలు అందుకున్నారు. రాష్ట్రంలో వైద్య, విద్య ప్రమాణాలను మెరుగుపరిచారు (political journey Nitish Kumar).
మరో విశేషమేమిటంటే.. బీహార్‌కు ఇన్నేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీశ్ కుమార్ అన్నిసార్లూ ఎమ్మెల్సీగానే ఉన్నారు (Nitish Kumar alliances). నితీశ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కొత్తలో 1977, 1980, 1985 ఎన్నికల్లో హర్నాట్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు పోటీ చేశారు. తొలి రెండు సార్లు ఓటమి పాలై, 1985లో మొట్టమొదటిసారి విజయం సాధించి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు.
ఇవీ చదవండి:
ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు.. డీఎన్ఏ అతడిదే..
ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు.. ఉమర్ బంధువు అరెస్ట్..
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..