PM Modi: ఉల్లాసంగా, ఉత్సాహంగా ప్రధాని మోదీ.. నెట్టింట్లో ట్రెండింగ్
ABN , Publish Date - Nov 20 , 2025 | 05:54 PM
బిహార్ ముఖ్యమంత్రిగా ఇవాళ నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు హాజరైన ప్రధాని మోదీ స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. బీహార్ పర్యటన మొత్తం మంచి ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపించిన ప్రధాని మోదీ నేడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలుస్తున్నారు.
పాట్నా, నవంబర్ 20: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నారు. బిహార్లో ఎన్డీయే విజయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్న ప్రధాని మోదీ, 'గంచా మూమెంట్' తీసుకొచ్చారు. మెడలోని కండువా తీసి తలపై గుండ్రంగా తిప్పుతూ జనాన్ని ఉర్రూతలూగించారు. బిహార్ ముఖ్యమంత్రి నీతీష్ కుమార్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ప్రధాని ఉదయం నుంచీ చాలా ఉత్సాహంగా కనిపించారు. వేదిక వద్దకు చేరుకునే సందర్భంలో కూడా ప్రధాని తన కండువా గాల్లో ఊపుతూ అక్కడికి చేరుకున్న ప్రజల్ని ఉత్సాహపరిచే యత్నం చేశారు.
కాగా, బిహార్‌కు పదవసారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షా తదితర ఎన్డీయే పెద్దలు హాజరయ్యారు. పాట్నాలోని గాంధీ మైదాన్‌లో జరిగిన ఈ వేడుకకు భారీ ఎత్తున జనం హాజరయ్యారు. ఈ సందర్భంగా పీఎం మోదీ తన కండువాతో జనాల్ని ఉత్సాహపర్చారు.
ముఖ్యమంత్రి, మంత్రుల చేత గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారాలు చేయించారు. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ (జేడీ-యూ), బీజేపీ నేతలు సామ్రాట్ చౌదరీ, విజయ్ కుమార్ సిన్హా ఉప ముఖ్యమంత్రులుగా, మరో 26 మంది మంత్రులుగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరలు కొంచెం పెరిగాయి.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News