Bihar government formation: బీహార్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం
ABN , Publish Date - Nov 16 , 2025 | 01:06 PM
దేశమంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసిన బీహార్ ఎన్నికల ఘట్టం ముగిసింది. ఎన్డీయే పక్షం తన అధికారాన్ని తిరిగి నిలబెట్టుకుంది. 243 అసెంబ్లీ స్థానాల్లో ఎన్డీయే కూటమి 202 స్థానాల్లో విజయం సాధించింది. ప్రతిపక్ష మహాగఠ్ బంధన్ 35 స్థానాలకు పరిమితమైంది.
దేశమంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసిన బీహార్ ఎన్నికల ఘట్టం ముగిసింది. ఎన్డీయే పక్షం తన అధికారాన్ని తిరిగి నిలబెట్టుకుంది. 243 అసెంబ్లీ స్థానాల్లో ఎన్డీయే కూటమి 202 స్థానాల్లో విజయం సాధించింది. ప్రతిపక్ష మహాగఠ్ బంధన్ 35 స్థానాలకు పరిమితమైంది. దీంతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది (Bihar politics).
ఈ నెల 19 లేదా 20న బీహర్ సీఎంగా నితీష్‌కుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగా, అంతకు ముందు సోమవారం గవర్నర్‌కు నితీష్‌కుమార్ రాజీనామా సమర్పించనున్నారు. 17వ శాసనసభ రద్దు తీర్మానాన్ని కేబినెట్ ఆమోదించనుంది. నితీష్‌కుమార్ రాజీనామా తర్వాత ఎన్డీయే భాగస్వామ్య పక్షాల శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. కూటమి ఎమ్మెల్యేలు ఎన్డీయే నేతను ఎన్నుకోనున్నారు (Bihar government formation date).
అనంతరం ఎన్డీయే పక్షాలు గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్‌ను అనుమతి కోరుతాయి (Bihar latest updates). ఆ తర్వాత పట్నాలోని గాంధీ మైదానంలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎం ప్రమాణస్వీకారానికి ప్రధాని, పలు రాష్ట్రాల సీఎంలు హాజరుకాబోతున్నారు. నూతన ప్రభుత్వంలో బీజేపీకి 15, జేడీయూకి 14, ఎల్జేపీకి 3 మంత్రిపదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి
సోడియం లెవెల్స్ స్థిరంగా ఉండాలంటే ఎలాంటి ఆహార తీసుకోవాలి...
పైరసీ కింగ్ పిన్‌గా ఇమ్మడి రవి.. సంచలన విషయాలు వెలుగులోకి..