Nitish Kumar Son: హాట్ టాపిక్ అయిన నితీష్ కుమార్ తనయుడి ఇంటర్వ్యూ
ABN , Publish Date - Nov 20 , 2025 | 07:11 PM
తన తండ్రి ఇప్పటికి తొమ్మిది పర్యాయాలు బిహార్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ, ఏనాడూ రాజకీయాల జోలికి రాలేదు నితీష్ కుమార్ తనయుడు నిషాంత్ కుమార్. అయితే, ఇవాళ నితీష్ పదవసారి బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వేళ నిషాంత్ ఒక్కసారిగా వార్తల్లోకెక్కారు.
పాట్నా, నవంబర్ 20: బిహార్ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో పదోసారి ప్రమాణ స్వీకారం చేశారు ఎన్డీయే భాగస్వామి, జనతాదళ్ యునైటెడ్ అధినేత నితీష్ కుమార్. అయితే, సాక్షాత్తూ సీఎం తనయుడైనప్పటికీ ఎప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉండే నితీష్ కుమార్ ఏకైక కుమారుడు నిషాంత్ కుమార్ ఇవాళ ఆశ్చర్యకర రీతిలో మీడియా ముందుకొచ్చారు. ఒక మీడియా ఛానల్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ సందర్భంగా నిషాంత్ కుమార్ మీడియాతో అరుదైన మాటలు మాట్లాడారు. 'పితాజీ పదవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సందర్భంగా ఆయనకు నా అభినందనలు. అందరూ పితాజీని అభినందిస్తున్నారు. బిహార్ ప్రజలు ఊహించిన దానికంటే ఎక్కువ ఇచ్చారు. నేను వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాన్న ఆరోగ్యం బాగుంది. బిహార్ అభివృద్ధికి ఇంకా చాలా చేయాలని ఉత్సాహంగా ఉన్నారు' అని నిషాంత్ చెప్పారు.
నిషాంత్, ఈ సారి తండ్రి ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యారు. స్టేజ్ వెనుక నుంచి ప్రధాని మోదీ, అమిత్ షా, ఇతర నాయకులతో నిషాంత్ సంభాషించారు. బిహార్ రాజకీయాల్లో నితీష్ వారసత్వం గురించి ఎప్పుడు మీడియా ప్రశ్నించినా నిషాంత్, 'నేను రాజకీయాల్లోకి రాను, పితాజీ ఏం చేస్తున్నారో ఆయనకు తెలుసు' అని స్పష్టం చేసేవారు.
బిహార్‌కు పదవ సారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఈ రోజు ఎన్డీఏతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 2025 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సరికొత్త రాజకీయ వ్యూహాన్ని అమలు చేశారు నితీష్ కుమార్. ఇవాళ ఆయన తనయుడు మీడియాకు ఇచ్చిన ఈ చిన్న ఇంటర్వ్యూ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరలు కొంచెం పెరిగాయి.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News