High Court: మెట్రోలో బెట్టింగ్ యాప్ యాడ్.. ఎండీకి నోటీసులు

ABN, Publish Date - Apr 26 , 2025 | 10:24 AM

హైదరాబాద్ మెట్రో ఎండీకి తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌‌కు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

హైదరాబాద్ మెట్రో ఎండీకి తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌‌కు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. కాగా.. బెట్టింగ్ యాప్స్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ఈ మేరకు పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ యాడ్‌లను ప్రమోట్ చేసిన వారికి నోటీసులు పంపించి పోలీసులు విచారించారు.


ఈ విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసెంబ్లీ సమావేశాల్లోనూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడారు. ఈ యాప్‌ల వల్ల ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతోమంది నష్టపోతున్నారని చెప్పారు. ఈమేరకు ఈ కేసును సీరియస్‌గా విచారించాలని సీఎం రేవంత్‌రెడ్డి పోలీసులను ఆదేశించారు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో ఎంతటి వారున్నా విడిచి పెట్టేది లేదని సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.


ఈ వార్తలు కూాడా చదవండి...

Kaleshwaram: తుమ్మిడిహెట్టి నిర్మాణం 3 బ్యారేజీలు పునర్నిర్మాణం

Mahabubabad: మానుకోటలో ఏసీబీ దాడులు

CM Revanth Reddy: పీవోకేను భారత్‌లో కలిపేయండి

Read Latest Telangana News And Telugu News

Updated at - Apr 26 , 2025 | 10:35 AM