Home » Hyderabad Metro Rail
హైదరాబాద్ నగరంలో మెట్రో రెండోదశ పార్ట్-బీలోని మూడు కారిడార్లకు(జేబీఎ్‌స-మేడ్చల్, జేబీఎస్- శామీర్‌పేట్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు- ఫోర్త్‌సిటీ) సంబంధించిన డీపీఆర్‌లను ఒక్కొక్కటిగా కాకుండా రెండింటినీ ఒకేసారి సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం మెట్రో అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.
ఫోర్త్ (ఫ్యూచర్) సిటీ వరకు మెట్రో రైలును విస్తరించాలని, అందుకు అవసరమైన తుది ప్రతిపాదనలను తయారు చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
Hyderabad Metro: మెట్రో రైలు ప్రయాణికులకు మెట్రో యాజమాన్యం శుభవార్త తెలిపింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మెట్రో రైలు సమయాలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓప్రకటన విడుదల చేసింది.
మెట్రో రెండోదశ నిర్మాణంలో భాగంగా పలు కారిడార్లలో అంచనా వ్యయం భారీగా పెరిగింది. రాయదుర్గం-కోకాపేట్ మార్గంలో కిలోమీటరుకు సగటున రూ.372 కోట్లు వ్యయం కానున్నట్లు సమాచారం.
Hyderabad Metro: హైదరాబాద్‌లో మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. పలు మార్గాల్లో మెట్రో రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. మెట్రో రైలు రాకపోకలకు గంట సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న నార్త్‌సిటీ మెట్రో కారిడార్లను వినూత్నంగా తీర్చిదిద్దేందుకు హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఏఎంల్) అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
హైదరాబాద్ మహానగరానికి ఔటర్ రింగు రోడ్డు మణిహారంగా మారింది. ఔటర్ కేంద్రంగా అభివృద్ధి దూసుకెళ్తోంది. నివాస ప్రాంతాలే కాకుండా వ్యాపార, వాణిజ్య కేంద్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. దీంతో ప్రజా రవాణా వ్యవస్థలు ఔటర్ రింగు రోడ్డుతో అనుసంధానమవుతున్నాయి. తాజాగా మెట్రో కారిడార్ కూడా విస్తరిస్తోంది.
ఓల్డ్‌సిటీ వాసులు మెట్రో రైలు కోసం మద్దతు పలుకుతున్నారు. తమ ప్రాంతంలో మెట్రో కలను నెరవేర్చుకోవడంలో భాగంగా ఆస్తులను ఇచ్చేందుకు సుముఖత చూపిస్తున్నారు.
ఓల్డ్ సిటీ మెట్రో భూసేకరణలో కీలక ఘట్టం చోటుచేసుకోనుంది. ప్రభావిత ఆస్తుల యజమానులకు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ రేపు చెక్కుల పంపిణీ చేయనున్నారు. దీంతో రెండో దశ మెట్రో పనులు ప్రారంభించడానికి లైన్ క్లియర్ క్లియర్ కానుంది.
హైదరాబాద్ నగర ఉత్తర ప్రాంత వాసులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నూతన సంవత్సర కానుక ఇచ్చారు. నార్త్‌సిటీకి త్వరలో మెట్రో రైలు సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు.