Hyderabad Metro: ప్రయాణికులకు అలర్ట్.. మెట్రో టైమింగ్స్ సవరణ
ABN , Publish Date - Nov 01 , 2025 | 03:58 PM
హైదరాబాద్ మెట్రో అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మెట్రో ప్రయాణ సమయాల్లో సవరణ చేసినట్లు ప్రకటించారు. సవరించిన ప్రయాణ వేళలు నవంబరు మూడో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు.
హైదరాబాద్, నవంబరు1 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మెట్రో ప్రయాణ సమయాల్లో సవరణ చేసినట్లు ప్రకటించారు. సవరించిన ప్రయాణ వేళల ప్రకారం వారంలోని అన్నిరోజుల్లో, అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి మెట్రో సేవలు ఉదయం 6:00 గంటల నుంచి రాత్రి 11:00 గంటల వరకు మాత్రమే నడుస్తాయని పేర్కొన్నారు. సవరించిన ప్రయాణ వేళలు నవంబరు 3వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని మెట్రో ప్రయాణికులు గమనించాలని సూచించారు. ప్రయాణికులు తమ ప్రయాణానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు మెట్రో అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పదేపదే బాంబు బెదిరింపులు.. ఆందోళనలో ప్రయాణికులు
షాకింగ్ ఘటన... జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారం
Read Latest Telangana News And Telugu News