Bandi Sanjay Kumar: ఆ విషయాలు గుర్తుకు తెచ్చుకుని బండి సంజయ్ ఎమోషనల్
ABN , Publish Date - Feb 23 , 2025 | 03:48 PM
Bandi Sanjay Kumar: రేవంత్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని బండి సంజయ్ కోరారు.

వరంగల్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజల పక్షాన, ఉపాధ్యాయుల కోసం ఏనాడైనా ఉద్యమాలు చేశారా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. తాము ప్రజల కోసం ఉద్యమాలు చేశాం, లాఠీ దెబ్బలు తిన్నామని గుర్తుచేశారు. అయినా బీజేపీకి ప్రజలు ఓట్లు వేయలేదు... ఎన్నికల్లో గెలిపించలేదని చెప్పారు. పేద ప్రజల సమస్యల కోసం ఎందుకు పని చేయాలని బీజేపీ కార్యకర్తలు తమను ప్రశ్నిస్తున్నారని బండి సంజయ్ కుమార్ చెప్పారు.
అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ సారి బీజేపీ బలపర్చిన వారికి ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తే ఏమి వచ్చిందని నిలదీశారు. ఇవాళ(ఆదివారం) బండి సంజయ్ వరంగల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ... రేవంత్ ప్రభుత్వం రేషన్ కార్డు, ఇల్లు ఇచ్చిందా అని ప్రశ్నించారు. మరి ఎందుకు కాంగ్రెస్‌కు ఓటు వేస్తున్నారని అడిగారు. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారికే ఓటు వేయాలని.. కొమ్ముకాస్తున్న వారికి ఓటు వేయద్దని అన్నారు. ఓటమి భయంతో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం కోసం వస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతలు మాయ మాటలు విని మోసపోవద్దని బండి సంజయ్ తెలిపారు.
ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదు: ఎంపీ ధర్మపూరి అర్వింద్
నిజామాబాద్: ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని నిజామాబాద్ ఎంపీ ధర్మపూరి అర్వింద్ విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓట్లు అడిగే అర్హత లేదని చెప్పారు. మంత్రులు ఏసీ గదులకు పరిమితం అయ్యారని ఆరోపించారు. ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదని అన్నారు. మహిళలు చీపుర్లు పట్టుకుని రెడీగా ఉన్నారని హెచ్చరించారు. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం కావాలంటే బీజేపీని ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలపర్చాలని ఎంపీ ధర్మపూరి అర్వింద్ కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి
Crime News: రాజలింగమూర్తి హత్య ఎలా జరిగిందంటే..: ఎస్పీ కిరణ్ ఖరే
Yadadri: ఆలయ స్వర్ణ విమాన గోపురాన్ని స్వామికి అంకితం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
Read Latest Telangana News and Telugu News