Kavitha Slams Congress Govt: సీఎం రేవంత్ రాష్ట్రంలో ఉండేది తక్కువ.. ఢిల్లీలో ఎక్కువ: కవిత ఫైర్
ABN , Publish Date - Jul 12 , 2025 | 01:05 PM
Kavitha Slams Congress Govt: సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ జపం చేయడం తప్ప పాలన తెలీదంటూ కవిత విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీలలో మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అని ఆరోపించారు.

రంగారెడ్డి, జులై 12: జిల్లాలోని కేశంపేట మండలం కాకునూర్ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గృహలక్ష్మి పథకాన్ని వెంటనే ప్రారంభించాలంటూ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రాష్ట్రంలో ఉండేది తక్కువని.. ఢిల్లీలోనే ఎక్కువగా ఉంటారని వ్యాఖ్యలు చేశారు. చదువుకునే విద్యార్థినులకు ఇస్తానన్న స్కూటీలు ఎక్కడ అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తే ఆడపిల్ల పెళ్ళికి లక్ష నగదుతో పాటు తులం బంగారం అన్నారని.. ఈ 18 నెలల్లో ఎక్కడైనా ఇచ్చారా అని నిలదీశారు.
సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ జపం చేయడం తప్ప పాలన తెలీదంటూ విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీలల్లో మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఉన్నారని అని ఆరోపించారు. సీఎం సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్‌లో అంబులెన్సులలో కనీసం డీజిల్ పోసే పరిస్థితి లేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే రెండు లక్షల కోట్ల అప్పు చేసిందని తెలిపారు. రేషన్ షాప్‌ల్లో ఇస్తున్న సన్న బియ్యంలో 50 శాతం దొడ్డు బియ్యమే అని నిరూపిస్తామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరారు. ఫ్రీ బస్సు పేరున గ్రామాలకు బస్సులు తగ్గించారని ఫైర్ అయ్యారు. ఈ ప్రభుత్వం పని చేసే ప్రభుత్వం కాదని.. వెంటపడి పని చేయించుకోవాలని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి..
రీసెర్చ్ సెంటర్ ప్రాంగణంలో చిరుతల కలకలం
కల్తీ కల్లు బాధితులకు డయాలసిస్..
Read Latest Telangana News And Telugu News