MLA: తులం బంగారం హామీ ఏమైందో చెప్పాలి..
ABN , Publish Date - Jul 12 , 2025 | 10:04 AM
అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిందని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. ఆడపిల్లల పెళ్లికి రూ.లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీ ఏమైనట్టు ఆయన ప్రశ్నించారు.

- ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్యే కృష్ణారావు
హైదరాబాద్: అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిందని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Kukatpally MLA Madhavaram Krishnarao) విమర్శించారు. ఆడపిల్లల పెళ్లికి రూ.లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీ ఏమైనట్టు ఆయన ప్రశ్నించారు. శుక్రవారం బాలానగర్ తహసీల్దార్ కార్యాలయంలో 56 మంది లబ్ధిదారులకు షాదిముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేద ఆడపిల్లల పెళ్లికి రూ. 1.16,000 అందించారన్నారు. కార్యక్రమంలో బోయినపల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, బేగంపేట కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి, తహసీల్దార్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
బోనాల చెక్కుల పంపిణీ..
బేగంపేట డివిజన్‌లోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాల చెక్కులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఉత్సవ కమిటీ సభ్యులకు అందజేశారు. ఉత్సవాలను అత్యంత వైభవంగా జరిపించాలని సూచించారు. అనంతరం శ్యామ్‌లాల్ బిల్డింగ్ సమీపంలో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. రోడ్డు పనుల్లో నాణ్యత పాటించాలని, ప్రజలకు ఇబ్బంది కలుగకుండా వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి, డివిజన్ అధ్యక్షుడు సురేశ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే..
తెలంగాణలో అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఇదే..
Read Latest Telangana News and National News