Share News

Leopard Scare: రీసెర్చ్ సెంటర్‌ ప్రాంగణంలో చిరుతల కలకలం

ABN , Publish Date - Jul 12 , 2025 | 11:30 AM

Leopard Scare: రంగారెడ్డి జిల్లాలో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. చిరుతలను బంధించేందుకు అటవీశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Leopard Scare: రీసెర్చ్ సెంటర్‌ ప్రాంగణంలో చిరుతల కలకలం
Leopard Scare

రంగారెడ్డి, జులై 12: జిల్లాలోని బాలాపూర్‌లో చిరుతల సంచారం (Leopard Migration) కలకలం రేపుతోంది. బాలాపూర్ రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ) ప్రాంగణంలో రెండు చిరుత పులులను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. దీంతో చిరుతల కోసం ఆర్సీఐ అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు ఫారెస్ట్ అధికారులు. చిరుతలను బంధించేందుకు బోన్లను ఏర్పాటు చేశారు. రెండు రోజుల క్రితం ఓ శునకాన్ని చిరుతలు చంపడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.


రెండు రోజుల క్రితం ఆర్సీఐ ప్రాంగణంలో రెండు చిరుత పులులు సంచరించడాన్ని అక్కడి వాచ్మెన్ గుర్తించి వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో రక్షణశాఖ అధికారులు అప్రమత్తమై అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న ఫారెస్ట్ అధికారులు ఆర్సీఐ పరిసర ప్రాంతాల్లో రెండు చిరుతల కోసం బోన్లు ఏర్పాటు చేశారు. అయితే ముందు వీటిని వన్యప్రాణాలుగా అంతా భావించారు. కానీ ఆర్సీఐ ప్రాంగణంలో ఓ శునకం మృతిచెంది కనిపించింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా.. వారు అక్కడకు చేరుకుని పాద ముద్రలను , సీసీ ఫుటేజ్‌లను పరిశీలించగా అవి రెండు చిరుత పులులుగా నిర్ధారణకు వచ్చారు.


దీంతో ఆర్సీఐ ప్రాంగణంలో హైఅలర్ట్ ప్రకటించారు. బాలాపూర్ పోలీసులు కూడా స్థానికంగా ఉన్న ప్రజలను అలర్ట్ చేశారు. చిరుతల సంచారంతో డిఫెన్స్ రీసెర్చ్ స్కూల్‌కు సెలవులు ప్రకటించారు. ఎవరైనా బయటకు వచ్చేటప్పుడు ఒంటరిగా రావొద్దని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు చిరుతల కోసం అటవీశాఖ అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.


ఇవి కూడా చదవండి..

కల్తీ కల్లు బాధితులకు డయాలసిస్..

మాజీ ఎంపీ ట్వీట్.. ఈ పోస్ట్‌కు అర్థమేమి సాయిరెడ్డి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 12 , 2025 | 01:13 PM