Share News

Special trains: ప్రతీ శుక్ర , శని వారాల్లో.. చర్లపల్లి నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు

ABN , Publish Date - Jul 12 , 2025 | 09:36 AM

ఆగస్టు నెలలో తొమ్మిది ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రతీ శుక్ర, శని వారాల్లో చర్లపల్లి నుంచి తిరుపతికి (07017), ప్రతి సోమ, శనివారాల్లో తిరుపతి నుంచి చర్లపల్లికి (07018) రైళ్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

Special trains: ప్రతీ శుక్ర , శని వారాల్లో.. చర్లపల్లి నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు
Special Trains

హైదరాబాద్: ఆగస్టు నెలలో తొమ్మిది ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే(South Central Railway) అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రతీ శుక్ర, శని వారాల్లో చర్లపల్లి నుంచి తిరుపతికి (07017), ప్రతి సోమ, శనివారాల్లో తిరుపతి నుంచి చర్లపల్లికి (07018) రైళ్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ రైళ్లు మల్కాజిగిరి, కాచిగూడ(Malkajgiri, Kacheguda), ఉందానగర్‌, షాద్‌నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌ నగర్‌, వనపర్తి రోడ్‌, గద్వాల్‌, కర్నూలు సిటీ, డోన్‌, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట, కడప, ఒంటిమిట్ట, రాజంపేట(Kadapa, Ontimitta, Rajampet), రేణిగుంట స్టేషన్‌లలో ఆగుతాయని పేర్కొన్నారు.


city5.2.gif

బుధ, గురువారాల్లో...

- ఇక ప్రతి బుధవారం చర్లపల్లి నుంచి తిరుపతికి (07251)రైలు... ప్రతి గురువారం తిరుపతి నుంచి చర్లపల్లికి (07252) నాలుగు రైళ్లు నడుపుతున్నట్లు తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు జనగాం, కాజీపేట, వరంగల్‌, నెక్కొండ(Jangaon, Kazipet, Warangal, Nekkonda), మహబూబాబాద్‌, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోల్‌, నెల్లూర్‌, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయని తెలిపారు.


city5.3.gif

ఈ వార్తలు కూడా చదవండి.

రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే..

తెలంగాణలో అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఇదే..

Read Latest Telangana News and National News

Updated Date - Jul 12 , 2025 | 12:40 PM