Home » Gudur
ఉత్తర భారత దేశంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి సెప్టెంబర్ 9న భారత గౌరవ్ టూరిస్ట్ రైలు యాత్ర నిర్వహిస్తున్నట్లు ఇండియన్ రైల్వే సౌత్ స్టార్ రైల్ అండ్ టూర్ టైమ్స్ డైరెక్టర్ విగ్నేష్ తెలిపారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో రైలుయాత్ర వాల్‌పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.
ఆగస్టు నెలలో తొమ్మిది ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రతీ శుక్ర, శని వారాల్లో చర్లపల్లి నుంచి తిరుపతికి (07017), ప్రతి సోమ, శనివారాల్లో తిరుపతి నుంచి చర్లపల్లికి (07018) రైళ్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
31వతేదీ, జూన్ 2వ తేదీన చెన్నై సెంట్రల్-గూడూరు సబర్బన్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే.. 1న చెన్నై బీచ్-చెంగల్పట్టు మధ్య సబర్బన్ రైళ్లు పాక్షిక రద్దు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వేశాఖ అధికారులు కోరారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మీదుగా ఆయా ప్రాంతాలకు వేసవి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది. ఆ రైళ్లు నిర్ణిత స్టేషన్లలో మాత్రమే ఆగుతాయని ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వేశాఖ తెలిపింది.
చెన్నై-గూడూరు, అరక్కోణం-జోలార్‌పేట, సేలం-కోయంబత్తూర్ తదితర మార్గాల్లో గంటకు 160 కి.మీ వేగంతో రైళ్లు నడిపేలా పనులు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ప్రధాన మార్గాల్లో రైళ్ల వేగం పెంచేందుకు దక్షిణ రైల్వే చర్యలు చేపట్టింది.
అంతా అనుకున్నట్లు జరిగుంటే.. ఆ ఇంట పెళ్లి బాజాలు మోగాల్సింది. శుక్రవారం ఉదయం ఆమె పెళ్లి కూతురుగా పీటలమీదకు ఎక్కాల్సి ఉంది. కానీ.. ఆ ఇంట విషాదం నెలకొంది. పది రోజుల కిందట అదృశ్యమైన ఆ విద్యార్థిని.. పంబలేరు వాగులో గురువారం మృతదేహంగా తేలింది.
చెన్నై: క్రిస్మస్, న్యూ ఇయర్(Christmas, New Year) సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది. - నెం.06039 తాంబరం - కన్నియాకుమారి ప్రత్యేక సూపర్‌ఫాస్ట్ రైలు(Superfast train) ఈనెల 24, 31 తేదీల్లో తాంబరం నుంచి అర్ధరాత్రి 12.35 గంటలకు బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 12.15 గంటలకు కన్నియాకుమారి చేరుకుంటుంది.
ప్రయాణికుల సౌకార్యార్ధం సికింద్రాబాద్-విల్లుపురం-సికింద్రాబాద్(Secunderabad-Villupuram-Secunderabad) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
చెన్నై సెంట్రల్-గూడూరు సెక్షన్(Chennai Central-Gudur section) పరిధిలోని తడ, సూళ్లూరుపేట మధ్య రైలుమార్గంలో మరమ్మతుల కారణంగా శుక్రవారం సూళ్లూరుపేట, నెల్లూరు వెళ్లే మెము రైళ్లు కొన్ని పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా రద్దయినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
నాయుడుపేట(Naidupeta) గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురై గూడూరు(Gudur) ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయస్వామి(Minister Dola Veeranjaneya Swamy) పరామర్శించారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారని మంత్రి చెప్పారు.