Share News

Trains: మూడు మార్గాల్లో 160 కి.మీ వేగంతో రైళ్లు

ABN , Publish Date - Mar 07 , 2025 | 01:02 PM

చెన్నై-గూడూరు, అరక్కోణం-జోలార్‌పేట, సేలం-కోయంబత్తూర్‌ తదితర మార్గాల్లో గంటకు 160 కి.మీ వేగంతో రైళ్లు నడిపేలా పనులు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ప్రధాన మార్గాల్లో రైళ్ల వేగం పెంచేందుకు దక్షిణ రైల్వే చర్యలు చేపట్టింది.

Trains: మూడు మార్గాల్లో 160 కి.మీ వేగంతో రైళ్లు

- నిర్మాణ పనులు ప్రారంభం

చెన్నై: దక్షిణ రైల్వే పరిధిలోని చెన్నై-గూడూరు(Chennai-Gudur), అరక్కోణం-జోలార్‌పేట, సేలం-కోయంబత్తూర్‌ తదితర మార్గాల్లో గంటకు 160 కి.మీ వేగంతో రైళ్లు నడిపేలా పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని ప్రధాన మార్గాల్లో రైళ్ల వేగం పెంచేందుకు దక్షిణ రైల్వే చర్యలు చేపట్టింది. రైలు మార్గాలు, సిగ్నలింగ్‌ వ్యవస్థ అభివృద్ధి, బ్రిడ్జి నిర్మాణం, వేగ పరిమితి తొలగింపు సహా పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులు పూర్తయిన మార్గాల్లో రైళ్ల వేగం పెంచి నడిపేందుకు అనుమతిస్తారు.

ఈ వార్తను కూడా చదవండి: Deputy CM: ఉదయనిధికి వ్యతిరేకంగా కొత్త కేసుల నమోదుపై స్టే


ఆ ప్రకారం, దక్షిణ రైల్వే పరిధిలోని చెన్నై-గూడూరు, చెన్నై-అరక్కోణం-జోలార్‌పేట తదితర మార్గాల్లో ప్రస్తుతం 130 కి.మీ వేగంతో రైళ్లు నడుపుతున్నారు. అలాగే, పలు మార్గాల్లో కూడా రైళ్ల వేగం క్రమక్రమంగా పెంచుతున్నారు. ప్రస్తుతం చెన్నై సెంట్రల్‌-బెంగళూరు-మైసూరు, సెంట్రల్‌-కోవై, చెన్నై ఎగ్మూర్‌-తిరునల్వేలి సహా పలు మార్గాల్లో వందే భారత్‌ రైళ్లు నడుపుతున్నారు. ఈ రైళ్లు అత్యధికంగా 180 కి.మీ వేగంతో వెళ్లే సామర్ధ్యం కలిగి ఉండగా, ప్రస్తుతం 110 నుంచి 130 కి.మీ వేగంతో మాత్రమే నడుపుతున్నారు.


అలాగే, ఈ మార్గాల్లో వెళ్లే ఇతర ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు 120 కి.మీ వేగంతో నడుస్తున్నాయి. ప్రస్తుతం వందే భారత్‌(Vande Bharat) సహా అన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేగం పెంచాలని నిర్ణయించారు. ఈ విషయమై దక్షిణ రైల్వే అధికారులు మాట్లాడుతూ... రైల్వే నిబంధనల ప్రకారం, గ్రూప్‌-ఏ మార్గాల్లో రైళ్లు అధికంగా 160 కి.మీ వేగంతో వెళ్లేందుకు అనుమతులున్నాయన్నారు.


nani2.2.jpg

అందువల్ల దక్షిణ రైల్వే పరిధిలోని చెన్నై-గూడూరు, అరక్కోణం-జోలార్‌పేట(Chennai-Gudur, Arakkonam-Jolarpet), సేలం-కోవై మార్గాల్లో గంటలకు 160 కి.మీ వేగంతో రైళ్లు నడిపేలా నిర్మాణాత్మక పనులు చేపట్టామన్నారు. అధికంగా ఉన్న వంపులు గుర్తించి తొలగించడం, పాత ఫ్లై ఓవర్ల తొలగింపు, కొత్త వంతెన నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే, సిగ్నలింగ్‌ వ్యవస్థ అభివృద్ధి, విద్యుత్‌ పంపిణి సామర్ధ్యాలు మెరుగుపరిచే చర్యలు ప్రారంభించామన్నారు. ఈ పనులు పూర్తయ్యేందుకు మూడు సంవత్సరాలు పడుతుందని అధికారులు తెలిపారు.


ఈ వార్తను కూడా చదవండి: కొలంబియా అమ్మాయి.. తెలంగాణ అబ్బాయి

ఈ వార్తను కూడా చదవండి: Srisailam Dam: ముప్పు ముంగిట శ్రీశైలం!

ఈ వార్తను కూడా చదవండి: Transfers: భారీగా ఐఏఎస్‌, ఐపీఎస్ ల బదిలీలు!?

ఈ వార్తను కూడా చదవండి: ఆస్తి పన్ను వసూళ్లపై స్పెషల్‌ ఫోకస్‌

Read Latest Telangana News and National News

Updated Date - Mar 07 , 2025 | 01:02 PM