Share News

Nellore: నేడు పెళ్లి జరగాల్సి ఉండగా.. ఏం జరిగిందో తెలిస్తే..

ABN , Publish Date - Jan 31 , 2025 | 12:39 PM

అంతా అనుకున్నట్లు జరిగుంటే.. ఆ ఇంట పెళ్లి బాజాలు మోగాల్సింది. శుక్రవారం ఉదయం ఆమె పెళ్లి కూతురుగా పీటలమీదకు ఎక్కాల్సి ఉంది. కానీ.. ఆ ఇంట విషాదం నెలకొంది. పది రోజుల కిందట అదృశ్యమైన ఆ విద్యార్థిని.. పంబలేరు వాగులో గురువారం మృతదేహంగా తేలింది.

Nellore: నేడు పెళ్లి జరగాల్సి ఉండగా.. ఏం జరిగిందో తెలిస్తే..

- పది రోజుల కిందట అదృశ్యమైన విద్యార్థిని

- పంబలేరువాగులో లభ్యమైన మృతదేహం

గూడూరు(నెల్లూరు): అంతా అనుకున్నట్లు జరిగుంటే.. ఆ ఇంట పెళ్లి బాజాలు మోగాల్సింది. శుక్రవారం ఉదయం ఆమె పెళ్లి కూతురుగా పీటలమీదకు ఎక్కాల్సి ఉంది. కానీ.. ఆ ఇంట విషాదం నెలకొంది. పది రోజుల కిందట అదృశ్యమైన ఆ విద్యార్థిని.. పంబలేరు వాగులో గురువారం మృతదేహంగా తేలింది. ఈ విషాద ఘటన గూడూరు(Gudur) మండలం పోటుపాళెం సమీపంలో చోటుచేసుకుంది. గూడూరు రూరల్‌ పోలీసులు తెలిపిన ప్రకారం.. సూళ్లూరుపేటలోని రాఘవయ్యపేటకు చెందిన శామ్యూల్‌ జయకుమార్‌, రమాదేవి దంపతుల కుమార్తె లేహానిస్సి(19) గూడూరులోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలలో ఈసీఈ రెండో సంవత్సరం చదువుతోంది. ఈమెకు సమీప బంధువుతో ఈ నెల 31వ తేదీ (శుక్రవారం) పెళ్లి నిశ్చయించారు.

ఈ వార్తను కూడా చదవండి: CM Chandrababu: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలు సీఎం కీలక సూచనలు


ఈ క్రమంలో ఈనెల 20వ తేదీన కళాశాలకు వెళ్లిన లేహానిస్సి ఇంటికి రాలేదు. పలుచోట్ల వెదికిన కుటుంబసభ్యులు.. ఆమె కనిపించడం లేదని ఈనెల 21న సూళ్లూరుపేట(Sullurpet) పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గూడూరు మండలం పోటుపాళెం సమీపంలోని పంబలేరువాగులో గురువారం లేహానిస్సి మృతదేహం లభ్యమైంది. శుక్రవారం ఉదయం పెళ్లి జరగాల్సి ఉండగా ఆమె మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విద్యార్థిని మృతికి గల కారణాలను పోలీసులు విచారిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించి రూరల్‌ ఇన్‌చార్జి ఎస్‌ఐ తిరుపతయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

nani5.2.jpg


ఈవార్తను కూడా చదవండి: Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్

ఈవార్తను కూడా చదవండి: కవితకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన రఘునందన్ రావు

ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్

ఈవార్తను కూడా చదవండి: గేదెలు కాసేందుకు వెళ్లిన రైతు.. అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్

Read Latest Telangana News and National News

Updated Date - Jan 31 , 2025 | 12:39 PM