Home » South Central Railway
చర్లపల్లి రైల్వే టర్మినల్ నుంచి కాకినాడ, నర్సాపూర్ మార్గాల్లో 36 రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్యరైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఆ రైళ్ల వివరాలు, అవి ఎక్కడెక్కడ ఆగుతాయన్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ప్రస్తుత వేసవి సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని ఆయా ప్రాంతాలకు వీక్లీ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. చర్లపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లతోపాటు మరికొన్ని స్టేషన్ల నుంచి ఈ రైళ్లు బయలు దేరనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
విశాఖ-బెంగళూరు మధ్య 14 ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే అధికారి తెలిపారు. విశాఖ- బెంగళూరు రైలు ఆదివారం రోజున విశాఖపట్నం నుంచి తిరుగు ప్రయాణం సోమవారం రోజున బెంగళూరు నుంచి అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
వివిధ సందర్భాల్లో రద్దయిన రైళ్లకు సంబంధించిన ప్రయాణికులు తమ టికెట్ సొమ్ము ను మూడు రోజుల్లోగా వాపసు తీసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న 32 రైళ్లకు స్టాప్‌లను మరో ఆరునెలల పాటు కొనసాగించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. అలాగే.. హోలీ పండుగ నేపథ్యంలో పాట్నా-చర్లపల్లి మార్గంలో ప్రత్యేకరైళ్ల (44సర్వీసుల)ను నడపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
ఊరెళ్లేందుకు రైల్వే స్టేషన్(Railway station)కు వెళ్తున్నారా, బుకింగ్ కౌంటర్ వద్ద రద్దీని చూసి భయపడుతున్నారా, మీకేం భయంలేదు, రైల్వే అధికారులు సువర్ణ అవకాశం కల్పించారు. అన్‌రిజర్వ్‌డ్ టికెటింగ్ సిస్టం(యూటీఎస్) యాప్ ద్వారా టికెట్లు తీసుకుంటే 3 శాతం క్యాష్ బ్యాక్ వంటి సేవలు కల్పించింది దక్షిణ మధ్య రైల్వే.
బీదర్ వయా సికింద్రాబాద్‌గా నిజాముద్దీన్‌కు రెండు ప్రత్యేకరైళ్లను నడుపుతునట్లు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ప్రకటించింది. ఈ నెల 26న బీదర్(Bidar) నుంచి ఉదయం 6 గంటలకు, తిరుగు ప్రయాణంలో మార్చి 1న నిజాముద్దీన్ నుంచి ఉదయం 7.45 లీగంటలకు ఈ ప్రత్యేక రైళ్లు (07223/ 07224) బయల్దేరుతాయని సీపీఆర్‌ఓ శ్రీధర్ వెల్లడించారు.
bhagyanagar express: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసింది. సికింద్రాబాద్, కాగజ్ నగర్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ రైల్‌ను రద్దు చేసింది.
ప్రయాణికులు రైల్వే టికెట్లను కొనుగోలు చేయడానికి దక్షిణ మధ్య రైల్వే మరింత సులువైన మార్గాలను ప్రవేశపెడుతోంది. ఇకపై రైల్వేస్టేషన్లలో సాధారణ టికెట్లతో పాటు రిజర్వేషన్ కేంద్రాల్లో టికెట్ చార్జీల చెల్లింపునకు మెరుగైన క్యూఆర్ కోడ్ వ్యవస్థను తీసుకువచ్చింది.
దక్షిణ మధ్య రైల్వే(South Central Railway)లో ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్(పీసీఓఎం)గా కె.పద్మజ(K.Padmaja) బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ రైల్వేస్ ట్రాఫిక్ సర్వీస్ 1991 బ్యాచ్‌కి చెందిన పద్మజ పీసీసీ ఎంగా విధులను నిర్వర్తిస్తూనే పీసీఓఎంగా అదనపు బాధ్యతలను నిర్వహించారు.