Minister Ponnam Prabhakar: రవాణా శాఖలో విప్లవాత్మక మార్పులు: మంత్రి ప్రభాకర్
ABN , Publish Date - Jul 12 , 2025 | 03:11 PM
తెలంగాణలో స్క్రాప్ పాలసీ తీసుకొచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ ఉద్ఘాటించారు. 15 సంవత్సరాలు దాటిన వాహనాలు స్క్రాప్‌కి వెళ్తున్నాయని వివరించారు. రాష్ట్రం వాహన సారథిలోకి ఎంట్రీ అయిందని చెప్పారు. వాహనాల ఫిట్‌నెస్, పొల్యూషన్ అన్నీ వాహన సారథిలో చూసుకోవచ్చని మంత్రి ప్రభాకర్ తెలిపారు.

నల్లగొండ: తెలంగాణలో రవాణా శాఖలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) వ్యాఖ్యానించారు. వాహనాల ఫిట్‌నెస్, డ్రైవింగ్‌పై అవగాహన లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఇవాళ(శనివారం) నల్లగొండలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. తెలంగాణలో 17 ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్‌లు నిర్మిస్తున్నామని చెప్పుకొచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్.
15 సంవత్సరాలు దాటిన వాహనాలు స్క్రాప్‌కి వెళ్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. రాష్ట్రం వాహన సారథిలోకి ఎంట్రీ అయిందని చెప్పారు. వాహనాల ఫిట్‌నెస్, పొల్యూషన్ అన్నీ వాహన సారథిలో చూసుకోవచ్చని తెలిపారు. ఏఐ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్‌లు ఇచ్చేలా చేస్తున్నామని అన్నారు. యాక్సిడెంట్‌లు చేస్తే లైసెన్స్‌లు వెంటనే రద్దు చేస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్, స్క్రాప్ పాలసీ, ఈవీ పాలసీ తీసుకువచ్చామని నొక్కిచెప్పారు. డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లు వస్తున్నాయని…అక్కడ ట్రైనింగ్ తీసుకున్న తర్వాతనే లైసెన్స్‌లు వస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
రిజర్వేషన్ల విషయంలో పొన్నం ప్రభాకర్ కొట్లాడారు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నల్గొండ జిల్లాలో రూ.8 కోట్లతో ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ (ATS) భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఇది తెలంగాణలోనే రెండవ ATS సెంటర్ అని ఉద్ఘాటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడంలో పొన్నం ప్రభాకర్ కేబినెట్‌లో కొట్లాడారని గుర్తుచేశారు. నిజాం కాలంలో మొదటి డిపో నార్కెట్‌పల్లి అని ఇప్పుడు 60 బస్సులు ఉన్నాయని.. ఇంకో 20 బస్సులు కావాలని సూచించారు. నల్లగొండ డిపోను నూతనంగా నిర్మించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
రీసెర్చ్ సెంటర్ ప్రాంగణంలో చిరుతల కలకలం
కల్తీ కల్లు బాధితులకు డయాలసిస్..
Read Latest Telangana News And Telugu News