Road Accident: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం
ABN , Publish Date - Nov 27 , 2025 | 06:51 AM
తెలంగాణలో ఇటీవల ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. వరుస ప్రమాదాలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా మహబూబ్‌నగర్‌లో జరిగిన ఘటనలో ఇథనాల్ ట్యాంకర్ డ్రైవర్ మృతిచెందాడు.
మహబూబ్‌నగర్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఇటీవల ఘోర ప్రమాదాలు (Road Accident) జరుగుతున్నాయి. వరుస ప్రమాదాలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా మహబూబ్‌నగర్‌లో జరిగిన ఘటనలో ఇథనాల్ ట్యాంకర్ డ్రైవర్ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం పిల్లిగుండు వద్ద 167 ఎన్ జాతీయ రహదారిపై ఘోర అగ్నిప్రమాదం జరిగింది.
మహబూబ్‌నగర్ నుంచి ఇథనాల్ ట్యాంకర్.. తాండూరు నుంచి ఐరన్ లోడ్‌తో లారీ వస్తోన్నాయి. ఈ క్రమంలోనే ఎదురుగా వచ్చిన ఇథనాల్ ట్యాంకర్‌ను లారీ ఢీకొంది. ఈ ఘటనతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఇథనాల్ ట్యాంకర్ డ్రైవర్ అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు. వెంటనే స్థానికులు లారీ డ్రైవర్‌ను రక్షించారు. ప్రమాద విషయాన్ని పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం అందజేశారు. సమాచారం అందగానే పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది, పోలీసులు శ్రమించారు. మూడు ఫైర్ ఇంజన్లతో మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు ఫైర్ సిబ్బంది. ప్రమాద స్థలానికి చేరుకొని ఘటనపై ఆరా తీశారు మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ జానకి. ఇథనాల్ ట్యాంకర్ డ్రైవర్ అతివేగంతో నడపడంతోనే ఈ ఘటన జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు పోలీసులు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజ్యాంగ విలువలను కాపాడుకుంటాం:సీఎం చంద్రబాబు
ఏపీలో భారీ అగ్నిప్రమాదం.. బ్యాంకులో ఒక్కసారిగా మంటలు..
Read Latest Telangana News And Telugu News