Share News

Kavitha: వారిని ఎవరూ రక్షించలేరు.. కవిత మాస్ వార్నింగ్

ABN , Publish Date - Nov 17 , 2025 | 10:56 AM

జాగృతి జనం బాటలో భాగంగా ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించేలా ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న వ్యక్తులని దీర్ఘకాలం ఎవరూ రక్షించలేరని హెచ్చరించారు.

Kavitha: వారిని ఎవరూ రక్షించలేరు.. కవిత మాస్ వార్నింగ్
Kavitha

ఖమ్మం జిల్లా, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తాను పోరాటం చేస్తున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) వ్యాఖ్యానించారు. ఇవాళ(సోమవారం) ఖమ్మం జిల్లా (Khammam Dist)లోని ఎర్రుపాలెం మండలం జమలాపురంలో కవిత పర్యటించారు. పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో ఇవాళ, రేపు రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి శాతవాహన ఎక్స్‌‌ప్రెస్‌లో మధిరకు నిన్న(ఆదివారం) చేరుకున్నారు. రైల్వే స్టేషన్‌లో కవితకు ఘన స్వాగతం పలికారు జాగృతి కార్యకర్తలు, అభిమానులు.


ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. జాగృతి జనం బాటలో భాగంగా ప్రజా సమస్యలను తెలుసుకుని.. వాటిని పరిష్కరించేలా సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై తాను పోరాటం చేస్తున్నానని పేర్కొన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న వ్యక్తులని దీర్ఘకాలం ఎవరూ రక్షించలేరని హెచ్చరించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల వైఫల్యం వల్లే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచిందని విమర్శించారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలుపై, ప్రజా సమస్యలపై జాగృతి సంస్థ నిరంతరం పోరాటం చేస్తోందని కవిత పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వందకుపైగా పైరసీ వెబ్‌సైట్లు.. రవి నెట్‌వర్క్‌లో షాకింగ్ విషయాలు

సౌదీ అరేబియా ఘటన.. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించండి.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 17 , 2025 | 11:11 AM