Home » Kalvakuntla kavitha
గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని కల్వకుంట్ల కవిత విమర్శించారు. 5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చామని చెప్పుకుంటూ.. మరోవైపు 15 లక్షల కార్డులు తొలగించే ప్రయత్నం జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు.
జీవో 317ను వెంటనే రద్దు చేసి ఉద్యోగులకు సొంత జిల్లాల్లో పోస్టింగ్స్ ఇవ్వాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి కవిత బహిరంగ లేఖ రాశారు.
కొత్త రాజకీయ పార్టీపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 25న జెండాను ఆవిష్కరిస్తామని... అదే రోజు పార్టీ పేరును ప్రకటించనున్నట్లు కవిత వెల్లడించారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ ఏర్పాటుపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈనెల 27న శ్రీరామనవమి రోజు పార్టీకి సంబంధించిన అధికారిక ప్రకటన చేసే అవకాశముందని సమాచారం.
నేను ఎవరితోనూ రాజీపడను.. ఆ అవసరం కూడా నాకు లేదు. నా పోరాటమంతా డాడీ (కేసీఆర్), మోడీ (ప్రధాని), చిన్నమోడీ (సీఎం రేవంత్‌రెడ్డి) పైనే’’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ స్థాపన దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన నూతన పార్టీకి ‘తెలంగాణ ప్రజా జాగృతి’ అని పేరు ఖరారు చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ బ్యాంక్‌కు మూసీ పరివాహక ప్రాంత భూములను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు సీబీఐ అధికారులు ఈరోజు నోటీసులు జారీ చేశారు. కవితతో పాటు అరుణ్ రామచంద్ర, అభిషేక్ బోయిన్‌పల్లి, శరత్ రెడ్డి, మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డిలకు ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి నోటీసులు జారీ చేశారు.
వెలుగుమట్ల బాధితుల పట్ల ప్రభుత్వం పగబట్టినట్టుగా వ్యవహరిస్తోందని కవిత విమర్శించారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఢిల్లీ మద్యం కేసులో మొత్తం 23 మంది నిందితులను డిశ్చార్జి చేస్తూ సీబీఐ, దాని దర్యాప్తు అధికారిపై రౌజ్ అవెన్యూ కోర్టు చేసిన వ్యతిరేక వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. కింది కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా సీబీఐ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌పై......