Share News

Pankaj Chaudhary: కాళేశ్వరం ప్రాజెక్టు రుణాల రీ షెడ్యూలింగ్.. కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి వివరణ

ABN , Publish Date - Aug 04 , 2025 | 01:49 PM

లోక్‌సభలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడారు. ఎంపీ చామల అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తే అప్పులపై వడ్డీ తగ్గించే అంశం పరిశీలిస్తామని పంకజ్ చౌదరి తెలిపారు.

Pankaj Chaudhary: కాళేశ్వరం ప్రాజెక్టు రుణాల రీ షెడ్యూలింగ్.. కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి వివరణ
Union Minister Pankaj Chaudhary

ఢిల్లీ: లోక్‌సభలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Congress MP Chamala Kiran Kumar Reddy) కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) గురించి మాట్లాడారు. ఎంపీ చామల అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి (Union Minister Pankaj Chaudhary) లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తే అప్పులపై వడ్డీ తగ్గించే అంశం పరిశీలిస్తామని పంకజ్ చౌదరి తెలిపారు. రుణాల చెల్లింపు రీ షెడ్యూల్ మార్పు చేస్తే, ఆర్బీఐ నిబంధనల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు ఖాతాను స్టాండర్డ్ నుంచి సబ్ స్టాండర్డ్‌కు డౌన్ గ్రేడ్ అవుతుందని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు రుణాల రిస్ట్రక్చర్‌కు తెలంగాణ ప్రభుత్వం నుంచి వినతులు వచ్చాయని గుర్తుచేశారు కేంద్రమంత్రి పంకజ్ చౌదరి.


కాళేశ్వరం ప్రాజెక్టు స్పెషల్ పర్పస్ వెహికల్‌కు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్‌లో రుణాలు ఇచ్చాయని కేంద్రమంత్రి పంకజ్ చౌదరి స్పష్టం చేశారు. పీఎఫ్సీ, ఆర్ఈసీ లాంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ లాంటి వివిధ మార్గాల్లో నిధులను సేకరిస్తాయని.. వారికయ్యే ఖర్చుల ఆధారంగా వడ్డీ రేట్లను నిర్ణయిస్తారని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయ్యే సమయాన్ని ఇప్పటికే డిసెంబర్ 2024కు ఆర్ఈసీ పొడిగించిందని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత రుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపు పరిశీలిస్తామని చెప్పుకొచ్చారు. రుణాల చెల్లింపు షెడ్యూల్ మార్పు చేస్తే ఆర్బీఐ నిబంధనల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు ఖాతాను స్టాండర్డ్ నుంచి సబ్ స్టాండర్డ్‌కు తగ్గుతుందని కేంద్రమంత్రి పంకజ్ చౌదరి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మహిళలు, పిల్లల రక్షణపై స్పెషల్‌ ఫోకస్‌

డ్రగ్స్‌ కేసుల్లో పబ్బులకు లింకులు

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 04 , 2025 | 01:54 PM