Home » Lok Sabha
లోక్‌సభలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడారు. ఎంపీ చామల అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తే అప్పులపై వడ్డీ తగ్గించే అంశం పరిశీలిస్తామని పంకజ్ చౌదరి తెలిపారు.
కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాలు పాక్ అధికార ప్రతినిధులుగా మారాయని ప్రధాని మోదీ విమర్శించారు. భారత్ సైన్యం విజయవంతంగా సర్జికల్స్ స్ట్రైక్స్ జరిపితే రుజువులు చూపించాలని అడుగుతోందని, అయితే సాక్ష్యాలకేమీ కొదవలేదని అన్నారు మోదీ.
హహల్గాం ఉగ్రదాడిలో పర్యాటకులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపారని రాహుల్ గాంధీ అన్నారు. ఉగ్రదాడిలో పిల్లలు, యువకులు, వృద్ధులు చనిపోయారని, భార్య కళ్ల ముందే భర్తను కాల్చి చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న ఓటర్ ఐడీ కార్డులు, చాకొలెట్ రేపర్లు పాకిస్థాన్‌లో తయారైనవేనని అమిత్‌షా చెప్పారు. ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడిపై రెండోరోజు మంగళవారంనాడు జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు.
నిర్లక్ష్యం కారణంగానే అమాయకులైన ప్రజలు ప్రాణాలు కోల్పోయారని పహల్గాం ఉగ్రదాడి నిరూపిస్తోందని అఖిలేష్ విమర్శించారు. దేశాన్ని పాలించేందుకు ప్రజల భావోద్వేగాలను తమకు ప్రయోజనకారిగా ప్రభుత్వం మార్చుకుంటోందని ఆరోపించారు.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ చేపట్టిన ఆపరేషన్‌పై విపక్షాలు సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తారనుకుంటే.. సందేహాలు వ్యక్తం చేస్తున్నారంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. లోక్‌సభలో రెండో రోజు మంగళవారం జరిగిన ప్రత్యేక చర్చలో అమిత్ షా మాట్లాడారు.
పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌పై జరిగిన చర్చలో జైశంకర్ మాట్లాడుతుండగా విపక్ష సభ్యులు పలుమార్లు అంతరాయం కలిగించారు. దీంతో అమిత్‌షా జోక్యం చేసుకుంటూ.. మీ సొంత విదేశాంగ మంత్రినే మీరు నమ్మరా' అంటూ విపక్షాలపై మండిపడ్డారు.
రాజ్యసభలోనూ ఆపరేషన్ సింధూర్, పహల్గాం ఉగ్రదాడిపై 16 గంటల సేపు చర్చ మంగళవారంనాడు జరుగనుంది. రాజ్యసభలోనూ రక్షణ మంత్రి చర్చను ప్రారంభిస్తారని తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే చర్చలో పాల్గొంటారు.
అమెరికా మధ్యవర్తిత్వంపై వస్తున్న ఊహాగానాలను జైశంకర్ కొట్టివేశారు. ఏప్రిల్ 22 జూన్ 17 మధ్య ప్రధానమంత్రి మోదీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య ఎలాంటి ఫోన్ కాల్ సంభాషణలు జరగలేదని సభకు వివరించారు.
ఆపరేషన్ సింధూర్ హైలైట్స్‌ను జే పాండా వివరిస్తూ, భారత వాయిసేన పాక్‌లోని 11 వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుందని, 20 శాతం పాక్ వాయిసేన ఆస్తులను ధ్వంసం చేసిందని చెప్పారు. 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు చెప్పారు.