Bandi Sanjay: హిందూ సనాతన ధర్మ రక్షణే నా లక్ష్యం: బండి సంజయ్
ABN , Publish Date - Nov 16 , 2025 | 12:05 PM
తెలుగు రాష్ట్రాల్లో ఇతర మతాల్లో చేరిన హిందువులకు ఘర్ వాపసీ అంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. వారికోసం హిందూ ధర్మ రక్షణ ద్వారాలు తెరిచే ఉన్నాయని పేర్కొన్నారు. మతాలను మార్చుకుంటే దేవుళ్లను మోసం చేసినట్లేనని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్, నవంబరు16 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఫలితాల తర్వాత హిందువుల్లో కసి పెరిగిందని వ్యాఖ్యానించారు. హిందువులంతా ఓటు బ్యాంకుగా మారాల్సిందేనని ఉద్ఘాటించారు. ఇవాళ(ఆదివారం) హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు బండి సంజయ్.
తెలుగు రాష్ట్రాల్లో ఇతర మతాల్లో చేరిన హిందువులకు ఘర్ వాపసీ అంటూ పిలుపునిచ్చారు. వారికోసం హిందూ ధర్మ రక్షణ ద్వారాలు తెరిచే ఉన్నాయని పేర్కొన్నారు. మతాలను మార్చుకుంటే దేవుళ్లను మోసం చేసినట్లేనని చెప్పుకొచ్చారు. అన్ని కులాలు తమ సామాజికవర్గ సంక్షేమానికి పాటుపడుతూనే.. హిందూ ధర్మం కోసం పనిచేయాలని సూచించారు.
హిందూ సనాతన ధర్మ రక్షణే తన లక్ష్యమని నొక్కిచెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సనాతన ధర్మ ప్రచారం చేయడం వల్ల.. ఇతర మతాల్లో చేరిన హిందువుల్లో పునరాలోచన వస్తోందని బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఐ బొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్.. సీవీ ఆనంద్ ఏమన్నారంటే..
షాకింగ్ .. ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్లు బంద్..
Read Latest Telangana News and National News