Kaleshwaram: కాళేశ్వరం కమిషన్ రిపోర్టుతో అసెంబ్లీలో చర్చ.. కీలక నిర్ణయాల దిశగా రేవంత్ ప్రభుత్వం..!
ABN , Publish Date - Jul 30 , 2025 | 09:50 AM
కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై ఉత్కంఠ నెలకొంది. రేపటితో జస్టిస్ ఘోష్ కమిషన్ గడువు ముగియనుంది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ విచారణ పూర్తయింది. రేపు ఫైనల్ రిపోర్టుపై పీసీ ఘోష్ సంతకం చేయనున్నారు. ఆగస్టు 1వ తేదీ లేదా 2వ తేదీన ప్రభుత్వానికి కాళేశ్వరం రిపోర్ట్ అందజేయనుంది.

హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై (Kaleshwaram Commission Report) ఉత్కంఠ నెలకొంది. రేపటి(గురువారం)తో జస్టిస్ ఘోష్ కమిషన్ గడువు ముగియనుంది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ విచారణ పూర్తయింది. రేపు ఫైనల్ రిపోర్టుపై పీసీ ఘోష్ సంతకం చేయనున్నారు. ఆగస్టు 1వ తేదీ లేదా 2వ తేదీన తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Govt) కాళేశ్వరం రిపోర్ట్ అందజేయనుంది. జస్టిస్ ఘోష్ కమిషన్ గడువును మరో 2, 3 రోజులు రేవంత్ ప్రభుత్వం పెంచే అవకాశాలు ఉన్నాయి. కమిషన్ రిపోర్ట్‌పై అసెంబ్లీలో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌లో ఏయే అంశాలు చేర్చారనే అంశం ఉత్కంఠగా మారింది.
కాగా, గత కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరంలో భారీగా అవినీతికి పాల్పడిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సుప్రీమ్ కోర్టు మాజీ జడ్జి పినాకి చంద్ర ఘోష్ కమిషన్‌ను 2024లో రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జస్టిస్ ఘోష్ కమిషన్‌తో కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై విచారణ జరిపించింది కాంగ్రెస్ ప్రభుత్వం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులను, పలువురు కీలక అధికారులను ఈ కమిషన్ విచారణ జరిపింది. ఈ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్, ఈ ప్రాజెక్ట్‌లో పనిచేసిన అధికారులని కూాడా విచారించింది. కమిషన్‌కు వారు ఇచ్చిన సమాచారం కూడా కీలకంగా మారింది. అయితే దీనికి తోడు కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో పనిచేసిన పలువురు అధికారుల నివాసాల్లోనూ ఏసీబీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ తనిఖీల్లో పలు కీలక డాంక్యుమెట్లని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి సమర్పించారు. అయితే రేపటి(గురువారం)తో జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ పూర్తికానుంది. ఈ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా రేవంత్ ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
బెట్టింగ్ యాప్స్ కేసులో ప్రకాష్‌రాజ్‌కు ఈడీ నోటీసులు.. ఇవాళ విచారణకు హాజరు
గుడ్ న్యూస్.. రేవంత్ ప్రభుత్వం మరో కీలకనిర్ణయం.. వాటికి గ్రీన్ సిగ్నల్
Read latest Telangana News And Telugu News