Congress: రేవంత్‌కు రాహుల్ గాంధీ లేఖ.. అసలు విషయమిదే..
ABN , Publish Date - Apr 21 , 2025 | 01:02 PM
Congress: సీఎం రేవంత్‌రెడ్డికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ లేఖ రాశారు. తెలంగాణలో వేముల రోహిత్ చట్టాన్ని తీసుకురావాలని రాహుల్‌గాంధీ కోరారు. ఈ లేఖపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు.

ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ(సోమవారం) లేఖ రాశారు. తెలంగాణలో వేముల రోహిత్ చట్టాన్ని అమలు చేయాలని రాహుల్ గాంధీ లేఖలో కోరారు. అయితే రోహిత్ చట్టంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. రాహుల్ గాంధీ ఏం ఆలోచించినా ప్రజల కోసమే ఆలోచిస్తారని అన్నారు. రోహిత్ చట్టం తేవాలని రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారని తెలిపారు. రోహిత్ చట్టంపై సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకుంటారని అన్నారు. గాంధీభవన్‌లో సోమవారం నాడు ఎంపీ చామల కిరణ్ మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: ఎంపీ చామల
కేసీఆర్ చేసిన తప్పులకు రజతోత్సవ సభలో తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ పిట్టల దొర, కేటీఆర్ తుపాకీ రాముడని ఎద్దేవా చేశారు. ప్రజల నుంచి దోచుకున్న డబ్బులతో రజతోత్సవ సభ నిర్వహిస్తున్నారని తెలిపారు. రజతోత్సవాలు బీఆర్ఎస్ పార్టీకా, టీఆర్ఎస్ పార్టీకా అని ప్రశ్నించారు. రజతోత్సవ బ్యానర్‌లో బీఆర్ఎస్ అని ఉంటుందా.. టీఆర్ఎస్ అని ఉంటుందా అని నిలదీశారు. కేటీఆర్ మళ్లీ చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డిలను స్మరించుకున్నారని అన్నారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావలసిన అవసరం ఏముందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.
బీఆర్ఎస్ అధ్యక్ష పదవిపై ఎంపీ చామల కిరణ్ ఏమన్నారంటే...
కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యి చేసేదేముందని ప్రశ్నల వర్షం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కురిపించారు. తుపాకీ రాముడు కేటీఆర్ బాధ ఏంటో అర్థం కావడం లేదన్నారు. భారీ డైలాగులు కొట్టి కేసీఆర్ అధికారంలోకి వచ్చారని అన్నారు. కళ్లముందు జరిగిన చరిత్రను కేటీఆర్ వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. గాంధీ, నెల్సన్ మండేలా లాగా కేసీఆర్ ఫీల్ అవుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ అధ్యక్ష పదవిపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వనున్నట్లు సమాచారముందని అన్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడిగా బీసీ నేతకు అవకాశం ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్ కులగణన ఫలితమే బీఆర్ఎస్ పార్టీ బీసీని అధ్యక్షుడిగా నియమిస్తోందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..
Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..
TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..
Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య
Read Latest Telangana News And Telugu News