Share News

Kaleshwaram: కాళేశ్వరంపై పీసీ ఘోష్ నివేదిక.. సీఎం రేవంత్‌రెడ్డికి సమర్పణ

ABN , Publish Date - Aug 01 , 2025 | 07:08 PM

కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అధికారులు సమర్పించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో సీఎంకు నివేదిక అందజేశారు.

Kaleshwaram: కాళేశ్వరంపై పీసీ ఘోష్ నివేదిక.. సీఎం రేవంత్‌రెడ్డికి సమర్పణ
Kaleshwaram PC Ghose Commission Report

హైదరాబాద్: కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికను (Kaleshwaram PC Ghose Commission Report) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి (CM Revanth Reddy) ఇవాళ(శుక్రవారం ఆగస్టు 1) అధికారులు సమర్పించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో సీఎం రేవంత్‌రెడ్డికి నివేదికను అధికారులు అందజేశారు.


ఈ నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని తయారు చేసేందుకు కమిటీని నియమించింది తెలంగాణ ప్రభుత్వం. నీటిపారుదల శాఖ సెక్రటరీ, న్యాయ శాఖ సెక్రటరీ, జీఏడీ సెక్రటరీ సభ్యులుగా కమిటీని నియమించింది. ఈ నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని ఈనెల 4వ తేదీన రాష్ట్ర కేబినెట్‌కు పీసీ ఘోష్ కమిషన్ సమర్పించనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

కాళేశ్వరంపై పీసీ ఘోష్ నివేదిక.. సీఎం రేవంత్‌రెడ్డికి సమర్పణ

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌పై కొనసాగుతున్న విచారణ.. కస్టడీలో డాక్టర్ నమ్రత

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 01 , 2025 | 07:44 PM