Share News

MP Arvind: కేసీఆర్‌కు థ్రెట్.. ఎంపీ అరవింద్ షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Apr 26 , 2025 | 02:01 PM

MP Dharmapuri Arvind: మాజీ మంత్రి కేటీఆర్‌పై అరవింద్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్త చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా వచ్చిన డబ్బుతోనే రేపు ప్లీనరీ సభ పెడుతున్నారని ఎంపీ అరవింద్ ఆరోపించారు.

MP Arvind: కేసీఆర్‌కు థ్రెట్.. ఎంపీ అరవింద్ షాకింగ్ కామెంట్స్
MP Dharmapuri Arvind

హైదరాబాద్: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంపైన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్‌కు ఆయన కుటుంబ సభ్యుల నుంచి ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందుకే గత కొన్నేళ్లుగా కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఉంటున్నారని అన్నారు. అందరు ఒకే దగ్గర ఉంటే తనను కుటుంబ సభ్యులే చంపే అవకాశం ఉందనే భయంతో కేసీఆర్ దూరంగా ఉంటున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇవాళ(శనివారం) హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియాతో మాట్లాడారు.


కన్నా బిడ్డలు ఆయనను కలవాలన్న ముందుగా అపాయింట్మెంట్ ఉండాల్సిందేనని ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్పారు. మాజీ మంత్రి కేటీఆర్‌పై అరవింద్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలపై టెక్నికల్ రిపోర్ట్‌ను మీడియాకు ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా వచ్చిన డబ్బుతోనే రేపు ప్లీనరీ సభ పెడుతున్నారని అరవింద్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం, అప్పటి ఇరిగేషన్ మంత్రిపైన సీబీఐ , ఈడీ విచారణ జరిపి జైల్లో పెట్టాలని అన్నారు. కేసీఆర్ కంటే రేవంత్‌రెడ్డి అత్యంత డేంజర్ అని విమర్శలు చేశారు. రేవంత్‌రెడ్డిని ప్రత్యామ్నాయంగా ప్రజలు ఎన్నుకుంటే పాత ఆఫీసర్లనే ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వంలో అత్యంత అవినీతి అధికారులు ఉన్నారని ఆరోపించారు. ముందు అధికారుల మీద విచారణ చేస్తే ఎవరు సమర్ధవంతమైన వారో తెలుస్తుందని ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూాడా చదవండి...

Kaleshwaram: తుమ్మిడిహెట్టి నిర్మాణం 3 బ్యారేజీలు పునర్నిర్మాణం

Mahabubabad: మానుకోటలో ఏసీబీ దాడులు

CM Revanth Reddy: పీవోకేను భారత్‌లో కలిపేయండి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 26 , 2025 | 02:10 PM