Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్.. న్యాయస్థానం కీలక ఆదేశాలు
ABN , Publish Date - Aug 02 , 2025 | 05:47 PM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావు వేసిన పరువునష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్‌తో పాటు నటి సమంత విడాకుల వ్యవహారంలో కేటీఆర్‌పై నిరాధార ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావు (KTR) వేసిన పరువునష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha)కు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. మంత్రి కొండాపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు (Nampally Court) ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్‌తోపాటు నటి సమంత విడాకుల వ్యవహారంలో కేటీఆర్‌పై నిరాధార ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.
ప్రాథమిక సాక్ష్యాలను పరిశీలించిన నేపథ్యంలో నిందితురాలు కొండా సురేఖపై ఈ నెల (ఆగస్టు) 21వ తేదీ లోపు క్రిమినల్ కేసు నమోదు చేసి ఆమెకు నోటీసు జారీ చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. కేటీఆర్‌పైన కొండా సురేఖ నిరాధారమైన ఆరోపణలు చేశారని కేటీఆర్ న్యాయవాది వాదనలతో కోర్టు ఏకీభవించింది. ఫిర్యాదుతోపాటు సాక్షుల వాంగ్మూలాలు, డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాత, నిందితురాలు కొండా సురేఖపై ప్రాథమిక కేసు ఉన్నట్లు నాంపల్లి కోర్టు గుర్తించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
కాంగ్రెస్ మాత్రమే మోదీని కుర్చీ నుంచి దింపగలదు: రేవంత్‌రెడ్డి
ప్రభుత్వ సొమ్ము తిన్నవాళ్లను తిరిగి కక్కిస్తాం.. మహేష్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్
Read latest Telangana News And Telugu News