• Home » Nampalli

Nampalli

 నటి ప్రత్యూష కేసులో మరో కీలక పరిణామం

నటి ప్రత్యూష కేసులో మరో కీలక పరిణామం

నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడైన సిద్ధార్థ్‌రెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో లొంగిపోయారు. ట్రయల్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించగా, తెలంగాణ హైకోర్టు దాన్ని రెండేళ్లకు తగ్గించింది. ఈ తీర్పును సవాల్ చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో, నాలుగు వారాల్లో లొంగిపోవాలని సిద్ధార్థ్‌రెడ్డిని ఆదేశించింది.

నాంపల్లి కోర్టుకి సీఎం రేవంత్‌రెడ్డి.. ఎందుకంటే..

నాంపల్లి కోర్టుకి సీఎం రేవంత్‌రెడ్డి.. ఎందుకంటే..

హైదరాబాద్‌లోని నాంపల్లి మనోరంజన్ ప్రజా ప్రతినిధుల కోర్టుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ(శనివారం) హాజరయ్యారు. గతంలో నమోదైన ఎన్నికల కోడ్ ఉల్లంఘన, కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసుల విచారణ నేపథ్యంలో న్యాయమూర్తి ఎదుట ఆయన కోర్టులో హాజరై విచారణను ఎదుర్కొన్నారు.

నాంపల్లి అగ్నిప్రమాదం కేసు.. ఫర్నిచర్ షాపు యజమాని అరెస్ట్

నాంపల్లి అగ్నిప్రమాదం కేసు.. ఫర్నిచర్ షాపు యజమాని అరెస్ట్

బచ్చాస్ ఫర్నిచర్ షాపు కేసుకు సంబంధించి షాపు యజమాని సతీష్ బచాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సతీష్.. సెల్లార్‌లో ఫర్నిచర్ షాపు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

నాంపల్లి అగ్ని ప్రమాదం.. సెల్లార్‌లో చిక్కుకున్న ఐదుగురి కోసం తీవ్ర ఆందోళన

నాంపల్లి అగ్ని ప్రమాదం.. సెల్లార్‌లో చిక్కుకున్న ఐదుగురి కోసం తీవ్ర ఆందోళన

హైదరాబాద్ నాంపల్లి అగ్నిప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ప్రమాదం జరిగి గంటలు గడుస్తున్నా భవనంలో చిక్కుకున్న ఐదుగురి ఆచూకీ ఇంకా తెలియకపోవడంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తమ వారి ఆచూకీ తెలపాలని బంధువులు రోదిస్తున్నారు.

నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. నుమాయిష్ సందర్శకులకు కీలక సూచన

నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. నుమాయిష్ సందర్శకులకు కీలక సూచన

నాంపల్లి ప్రాంతంలో ఫర్నిచర్ షాపులో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని, నుమాయిష్ సందర్శకులను తమ ఎగ్జిబిషన్ పర్యటనను శనివారం వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు.

ED Investigation: జన్వాడ భూముల కేసు.. కోర్టు ఆదేశాలివే..

ED Investigation: జన్వాడ భూముల కేసు.. కోర్టు ఆదేశాలివే..

సత్యం కంప్యూటర్ స్కామ్‌లో జన్వాడ భూములపై నాంపల్లి ప్రత్యేక కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. జన్వాడ ల్యాండ్ కేసులో సత్యం రాజు, నందిని రాజు, తేజ రాజులతో పాటు 213 మందికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ఈడీ అధికారులు కౌంటర్ దాఖలు చేయాలని నాంపల్లి ప్రత్యేక కోర్టు ఆదేశించింది.

Imandi Ravi Bail Plea: ఐబొమ్మ రవికి షాక్.. ఆ ఐదు కేసుల్లోనూ..

Imandi Ravi Bail Plea: ఐబొమ్మ రవికి షాక్.. ఆ ఐదు కేసుల్లోనూ..

ఐ బొమ్మ రవికి నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. అతడి బెయిల్ పిటిషన్లను కొట్టి వేసింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో అతడిపై ఐదు కేసులు నమోదు అయ్యాయి. ఈ ఐదు కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ రవి కోర్టును ఆశ్రయించాడు.

CM Revanth Reddy: నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి..

CM Revanth Reddy: నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. దీంతో మూడు పాత కేసులకు సంబంధించి విచారణ పూర్తయింది. సీఎం హాజరుతో కోర్టు పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

YS Jagan: జగన్ అక్రమాస్తుల కేసులో ఊహించని పరిణామం

YS Jagan: జగన్ అక్రమాస్తుల కేసులో ఊహించని పరిణామం

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో కీలక మార్పులు జరగడంతో విచారణ మరింత ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడింది.

Bomb Threat: నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు.. పోలీసులు అలర్ట్..

Bomb Threat: నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు.. పోలీసులు అలర్ట్..

నాంపల్లి కోర్టుకు గుర్తుతెలియని వ్యక్తి దగ్గరి నుంచి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈ క్రమంలో వెంటనే పోలీసులు అప్రమత్తం అయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి